LOADING...
Pawan Kalyan: షాకింగ్.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు తీవ్ర అస్వస్థత
షాకింగ్.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు తీవ్ర అస్వస్థత

Pawan Kalyan: షాకింగ్.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు తీవ్ర అస్వస్థత

వ్రాసిన వారు Moogati Shabari
Jun 04, 2026
02:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే అనారోగ్య సమస్యల కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన, తాజాగా మళ్లీ అస్వస్థతకు గురయ్యారనే సమాచారం అభిమానులు, రాజకీయ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.

వివరాలు

క్యాబినెట్ సమావేశం మధ్యలోనే నిష్క్రమణ..

మంగళవారం ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో నిర్వహించిన కీలక మంత్రివర్గ సమావేశంలో పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. అయితే సమావేశం కొనసాగుతున్న సమయంలో ఆయనకు తీవ్రమైన వెన్నునొప్పి ప్రారంభమైనట్లు సమాచారం. నొప్పి తీవ్రత పెరగడంతో సమావేశాన్ని పూర్తిగా ముగియకముందే ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. సచివాలయం నుంచి నేరుగా మంగళగిరిలోని జనసేన పార్టీ క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్య బృందం నిరంతరం పరిశీలిస్తున్నట్లు సమాచారం.

వివరాలు

పాత గాయం ప్రభావమేనా?

గతంలో సినీ చిత్రీకరణల సమయంలో జరిగిన ప్రమాదాల కారణంగా పవన్ కళ్యాణ్‌కు వెన్నునొప్పి సమస్య ఏర్పడినట్లు తెలిసిందే. ప్రస్తుతం రాజకీయ బాధ్యతలు, విస్తృత పర్యటనలు, నిరంతర కార్యాచరణ వల్ల ఆ సమస్య మళ్లీ తీవ్రతరమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల అనంతరం పవన్ కళ్యాణ్ ఒకవైపు ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వ బాధ్యతలు నిర్వహిస్తూనే, మరోవైపు సినీ ప్రాజెక్టులపైనా దృష్టి సారిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా వ్యవహరిస్తూ రాజకీయ, సినీ రంగాల్లో సమతుల్యత పాటించే ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement

వివరాలు

అభిమానుల ప్రార్థనలు..

పవన్ కళ్యాణ్ త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభిమానులు, పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు ఆకాంక్షిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని సందేశాలు, ప్రార్థనలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement