
Hostels Closed at Andhra University: భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం.. విశాఖ ఏయూలో హాస్టళ్లు మూసివేత
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా సురక్షిత చర్యలు ముమ్మరమవుతున్నాయి.
పాక్ తరచూ భారత జనావాసాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుపుతోంది. అంతేకాదు, డ్రోన్ల ద్వారా దాడులు కూడా కొనసాగిస్తోంది.
అయితే భారత్ వెంటనే కౌంటర్ చర్యలు చేపడుతూ.. డ్రోన్లను సమర్థంగా కూల్చివేస్తూ, కాల్పులకు తగిన జవాబులు ఇస్తోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో అప్రమత్తత చర్యలు తీసుకుంటున్నారు.
ఇప్పటికే పాక్‌పై భారత్ తీవ్రంగా విరుచుకుపడుతున్న తరుణంలో.. విశాఖపట్టణంలోని ఆంధ్రా యూనివర్సిటీ కీలక నిర్ణయం తీసుకుంది.
Details
విద్యార్థుల భద్రతే ముఖ్యం
యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వర్సిటీ హాస్టళ్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.
నేటి నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తోంది. పరీక్షలు పూర్తిచేసుకున్న విద్యార్థులు తమ స్వగ్రామాలకు తిరిగి వెళ్లాలని స్పష్టంగా తెలియజేశారు.
ఇక భద్రతా అంశాలతో పాటు నీటి కొరత, వార్షిక మరమ్మత్తుల అవసరాన్ని కూడా హాస్టళ్ల మూసివేతకు కారణాలుగా పేర్కొంది ఆంధ్రా యూనివర్సిటీ రిజిస్ట్రార్ కార్యాలయం.
మొత్తంగా దేశంలో నెలకొన్న అస్థిర పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల క్షేమాన్ని దృష్టిలో తీసుకుని తీసుకున్న ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.