Bihar: బిహార్‌లో ఆర్‌జేడీ నేత పంకజ్ రాజ్ దారుణ హత్య
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్ వైశాలి జిల్లా హాజీపూర్ స్థానిక కౌన్సిలర్, రాష్ట్రీయ జనతాదళ్ (RJD) సభ్యుడు పంకజ్ రాయ్ మంగళవారం దారుణ హత్యకు గురయ్యారు.
పంకజ్‌రాజ్ ఇంట్లో ఉన్న సమయంలోనే ఈ సంఘటన జరిగింది. పంకజ్ దగ్గరకు వచ్చిన దుండగులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు.
వారిని చూసిన వెంటనే ఆయన ఇంట్లోకి పరిగెత్తినా దుండగులు వెంబడించి మరి కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో పంకజ్‌రాయ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
దీనిపై బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. నితీశ్, ఎన్‌డీఏ ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు.
వివరాలు
ఆర్జేడీ నేతపై మూడుసార్లు కాల్పులు
మరణించిన ఆర్జేడీ నేత పంకజ్ రాయ్‌పై మూడుసార్లు కాల్పులు జరిపారని ఎస్పీ హర్ కిషోర్ రాయ్ తెలిపారు.
కాగా, ఈ వ్యవహారంపై చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు.ఘటన గురించి సమాచారం అందిన వెంటనే మహువలోని ఆర్జేడీ ఎమ్మెల్యే డాక్టర్ ముఖేష్ రోషన్ సదర్ ఆసుపత్రికి చేరుకున్నారు.
బీహార్ డీజీపీకి, ముఖ్యమంత్రి నివాసానికి ఫోన్ చేసి ఘటన గురించి తెలియజేశారు.
ఎమ్మెల్యే డా.ముఖేష్ రోషన్ మాట్లాడుతూ బీహార్ లో నేరగాళ్ల ప్రాబల్యం ఉందన్నారు. హత్యలు, దోపిడీలు, అత్యాచారాలు ఇలా ప్రతి రోజూ అనేక సంఘటనలు జరుగుతున్నాయన్నారు.
.
వివరాలు
హాజీపూర్ బంద్‌కు ఎమ్మెల్యే పిలుపు
కాగా, ప్రజాప్రతినిధి ఫోన్ ను డీజీపీ ఎత్తడం లేదని ఆర్జేడీ ఎమ్మెల్యే డాక్టర్ ముఖేష్ రోషన్ ఆరోపించారు.
ఇలాంటి నేరగాళ్లను ఎన్ కౌంటర్ చేయాలని ఎమ్మెల్యే అన్నారు. హత్యలు, పెరుగుతున్న నేరాలకు వ్యతిరేకంగా నేడు హాజీపూర్ బంద్‌కు పిలుపునిచ్చామని ఎమ్మెల్యే తెలిపారు.
మృతుడు పంకజ్ రాయ్ హాజీపూర్ సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దిగి కాలా వెస్ట్ నివాసి. దీనితో పాటు, పంకజ్ రాయ్ హాజీపూర్ మున్సిపల్ కౌన్సిల్‌లోని వార్డు నంబర్ 5 కౌన్సిలర్‌గా కూడా ఉన్నారు.