NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Pune: పోర్ష్ కారు ప్రమాదం.. నన్ను పెద్దవాడిగా గుర్తించి విచారించండి మహో ప్రభో 
    తదుపరి వార్తా కథనం
    Pune: పోర్ష్ కారు ప్రమాదం.. నన్ను పెద్దవాడిగా గుర్తించి విచారించండి మహో ప్రభో 

    Pune: పోర్ష్ కారు ప్రమాదం.. నన్ను పెద్దవాడిగా గుర్తించి విచారించండి మహో ప్రభో 

    వ్రాసిన వారు Stalin
    Jun 03, 2024
    02:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పూణే రోడ్డులో అర్థరాత్రి పోర్ష్ కారు ప్రమాదంలో ఇద్దరు 24 ఏళ్ల ఇంజనీర్లు చనిపోయారని 17 ఏళ్ల బాలుడు.. పోలీసులకు చెప్పాడు.

    ఆ సమయంలో తాగి ఉన్నందున ఆ రాత్రి ఏమి జరిగిందో తనకు గుర్తు లేదన్నాడు.

    Details 

    పోలీసులను,జువైనల్ జస్టిస్ బోర్డ్ ను వేడుకుంటున్నాడు 

    ఇప్పుడు అబ్జర్వేషన్ హోమ్‌లో ఉన్నఆ యువకుడు, తనను పెద్దవాడిగా విచారించమని పోలీసులను అభ్యర్థించాడు.

    దీనిపై జువైనల్ జస్టిస్ బోర్డ్ విచారిస్తుంది. ప్రమాదం జరగడానికి కొద్దిసేపటి ముందు మద్యం సేవిస్తూ కెమెరాకు చిక్కాడు.

    పబ్‌లో రూ 48,000 ఖర్చు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అతని విచారణ సమయంలో, యువకుడు ఆ రాత్రి ఏమి జరిగిందో గుర్తుకు తెచ్చుకోలేకపోయాడని తెలిసింది.

    యువకుడి అసలు రక్త నమూనాను మళ్లీ సేకరించటానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇది అతనిని కేసు నుండి బయటపడేయటానికి అనే ఆరోపణలు ఇప్పటికే వచ్చాయి.

    Details 

    యువకుడిని రక్షించడానికి చేసిన యత్నాలన్నీ ఫెయిల్ 

    క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తులో నిందితుడైన యువకుడిని రక్షించడానికి చేసిన యత్నాలపై పలు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.

    వాటిలో ఒకటి ప్రమాదానికి సంబంధించినది. మరొకటి మైనర్‌కు మద్యం సేవించడం.మూడవది బాలుడి తండ్రిపరోక్ష ప్రమేయంపై కింద నమోదైంది.

    సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారని యువకుడి తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు.

    కాగా కుటుంబ డ్రైవర్‌ను కిడ్నాప్ చేసి, ప్రమాదానికి కారణమని అతనిని బెదిరించారని తాతపై ప్రత్యేక కేసులు నమోదు చేశారు.

    నివేదికను తారుమారు చేయడానికి రక్త నమూనాలను మార్చడంపై ఫోరెన్సిక్ విభాగం అధిపతి అరెస్టు అయ్యారు.

    ఆయనతో పాటు ప్రభుత్వ ఆధ్వర్యంలోని సాసూన్ ఆసుపత్రికి చెందిన ఇద్దరు వైద్యులను అరెస్టు చేశారు.

    Details 

    మొత్తం కుటుంబమంతా కటకటాల పాలు 

    బాలుడి తాత, తండ్రి , తల్లిని కప్పిపుచ్చే ప్రయత్నంలో పాత్ర పోషించినందుకు అరెస్టు చేశారు.

    తన కుమారుడి నమూనాకు బదులుగా పరీక్షించిన టీనేజ్ తల్లి.ప్రస్తుతం జైలులో వున్నారు.

    సాసూన్ హాస్పిటల్‌లోని వైద్యులు తనకు స్పష్టమైన కారణం చెప్పకుండా తన నమూనాను సేకరించారని ఆమె చెప్పారు.

    కాగా తన కొడుకును రక్షించడానికి ప్రయత్నించలేదని తిరస్కరించానని పోలీసులకు చెప్పడాన్ని ఇక్కడ గమనించాలి.

    Details 

    ఇద్దరి ప్రాణాలు పోతే 300-పదాల వ్యాసం, 15 గంటల్లోనే బెయిలా ? 

    సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు అశ్విని కోస్తా , అనీష్ అవధియా మరణించిన ప్రమాదంపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది.

    300-పదాల వ్యాసం రాయాలని ,కోరడంపై పూనే ప్రజలు మండిపడ్డారు. ప్రమాదం జరిగిన 15 గంటల్లోనే యువకుడికి బెయిల్ మంజూరు కావడం పోలీసులపై విమర్శల వర్షం కురిసింది.

    దీంతో అతని మద్యపాన అలవాటు మాన్పించటానికి మానసిక చికిత్స కౌన్సెలింగ్ కు పంపారు.

    జువైనల్ జస్టిస్ బోర్డు ముందుగా తన ఉత్తర్వులను సవరించి, అబ్జర్వేషన్ హోమ్‌కు పంపింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర

    తాజా

    IPL 2025: నేటి నుంచే ఐపీఎల్ పునఃప్రారంభం.. ఆర్సీబీ, కేకేఆర్ మధ్య హోరాహోరీ పోటీ! ఐపీఎల్
    Rains: నేడు ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక ఆంధ్రప్రదేశ్
    Gayatri : ప్రముఖ గాయని కన్నుమూత అస్సాం/అసోం
    Dadasaheb Phalke: ఫాల్కే బయోపిక్‌పై క్లారిటీ.. రాజమౌళి కాదు, ఆమిర్‌ టీమ్‌ మాత్రమే సంప్రదించింది టాలీవుడ్

    మహారాష్ట్ర

    Maharashtra: మహారాష్ట్రలో పడవ ప్రమాదం.. ఒకరు మృతి.. ఐదుగురు గల్లంతు తాజా వార్తలు
    Cannibalism: తడోబా-అంధారీ టైగర్ రిజర్వ్‌లో అరుదైన ఘటన.. పులి పిల్లల్ని చంపి తింటున్నపెద్ద పులి  భారతదేశం
    Maratha Reservation: మరాఠా రిజర్వేషన్ ఉద్యమానికి దిగొచ్చిన సర్కార్.. దీక్షను విరమించిన మనోజ్ జరంగే మరాఠా రిజర్వేషన్
    Palghar : పాల్ఘర్ రైల్వే స్టేషన్ సమీపంలో వ్యక్తి మృతదేహం లభ్యం  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025