LOADING...
Odisha:మద్యం మత్తులోనే చెల్లి అవశేషాలతో బ్యాంకుకి.. ఒడిశా బ్యాంకు వివరణ
మద్యం మత్తులోనే చెల్లి అవశేషాలతో బ్యాంకుకి.. ఒడిశా బ్యాంకు వివరణ

Odisha:మద్యం మత్తులోనే చెల్లి అవశేషాలతో బ్యాంకుకి.. ఒడిశా బ్యాంకు వివరణ

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 29, 2026
12:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒడిశాలో జరిగిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మలిపోసిలోని గ్రామీణ బ్యాంకు శాఖకు తన మృతిచెందిన అక్క ఎముకల అవశేషాలను తీసుకెళ్లిన గిరిజనుడు జితు ముండా మద్యం మత్తులో ఉన్నాడని బ్యాంకు అధికారులు తెలిపారు. జితుముండా తన అక్క కల్రా పేరుతో ఉన్న ఖాతాలోని రూ.19,402తీసుకునేందుకు పలుమార్లు బ్యాంకును సంప్రదించాడు. అయితే, ఖాతాదారు స్వయంగా రావాలి లేదా చట్టబద్ధ వారసుల పత్రాలు తీసుకురావాలని అధికారులు చెప్పారు. కల్రా జనవరిలో మరణించినప్పటికీ, ఆ విషయం చెప్పినా బ్యాంకు సిబ్బంది పట్టించుకోలేదని జితు తెలిపాడు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన అతను అక్క సమాధిని తవ్వి,ఆమె అవశేషాలను తీసుకుని బ్యాంకుకు వచ్చాడు. ఈ ఘటనకు సంభందించిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అయ్యాయి.

వివరాలు 

వివరణ ఇచ్చిన బ్యాంకు 

"నేను ఎన్నిసార్లు బ్యాంకుకు వెళ్లినా, ఖాతాదారునే తీసుకురావాలని చెప్పారు. ఆమె చనిపోయిందని చెప్పినా వినలేదు" అని జితు వివరించాడు. అయితే, ఈ ఆరోపణలను బ్యాంకు ఖండించింది. మృతదేహాన్ని తీసుకురావాలని తమ సిబ్బంది ఎక్కడా చెప్పలేదని, వాస్తవాలను తప్పుగా ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. జితు మద్యం మత్తులో ఉండటం, అలాగే ప్రక్రియపై అవగాహన లేకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని వివరణ ఇచ్చింది. తర్వాత ప్రభుత్వం నుంచి మరణ ధృవపత్రం అందించగా, చట్టబద్ధ వారసుల పేర్లపై రూ.19,402 మొత్తాన్ని బ్యాంకు విడుదల చేసింది. విధి విధానాలకు అనుగుణంగా డబ్బు అందజేసినట్లు అధికారులు తెలిపారు. పోలీసుల సూచనల మేరకు బ్యాంకు వద్ద నుంచి తీసుకెళ్లిన అవశేషాలను తిరిగి సమాధిలోనే పూడ్చిపెట్టారు.

Advertisement