
భారతీయ రైల్వే 'షవర్ సౌకర్యం'; ఏసీ కోచ్ పైకప్పు లీక్ కావడంపై నెటిజన్లు ఫైర్
ఈ వార్తాకథనం ఏంటి
ప్యాసింజర్ రైలు కోచ్ పైకప్పు నుంచి నీరు కారుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
అవంతిక ఎక్స్‌ప్రెస్‌లోని ఒక ప్రయాణికుడు వర్షం పడుతున్న సమయంలో ఏసీ కోచ్ పైకప్పు నుంచి నీరు లీక్ అవుతుండగా ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఏసీ కోచ్ పైకప్పు లీకైన నేపథ్యంలో భారతీయ రైల్వేపై నెటిజన్లతో పాటు ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
భారతీయ రైల్వే కొత్తగా షవర్ సౌకర్యాన్ని రైళ్లలో ప్రవేశపెట్టినట్లు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు.
ఆ వీడియోను కాంగ్రెస్ షేర్ చేసింది. ప్రచారానికి పరిమితం అయ్యేకంటే రైల్వేకోసం కొంత పని చేసి ఉంటే బాగుండేదని పేర్కొంది.
భారతీయ రైల్వే దుస్థితికి బాధ్యులెవరు? అని మహిళా కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు నెట్టా డిసౌజా ప్రశ్నించారు.
రైలు
భారతీయ రైల్వేపై మండిపడ్డ నెటిజన్లు
ఇండియన్ రైల్వే ఓపెన్ షవర్ సౌకర్యంతో కొత్త సూట్ కోచ్‌ను ప్రారంభించిందని ఓ ట్విట్టర్ వినియోగదారు వ్యంగ్యంగా స్పందించాడు.
ఈ రైళ్లలో ప్రయాణీకులకు షవర్ జెల్, షాంపూ, బాత్రోబ్ అందించడం గురించి భారతీయ రైల్వే చర్చిస్తున్నట్లు మరో వినియోగదారుడు కామెంట్ చేశాడు.
2-టైర్ ఏసీ సీటు కోసం ప్రీమియం ఛార్జీని చెల్లించినప్పటికీ, ప్రయాణీకులు గణనీయమైన అసౌకర్యాలను భరిస్తూనే ఉన్నారని ఇంకో వినియోగదారుడు ట్వీట్ చేశాడు.
వర్షపు నీటి సంరక్షణతో వందే భారత్‌ను కూడా చేర్చాలని ఒకరు పేర్కొన్నారు.
రైళ్లలో హై-ఎండ్ టెక్నాలజీ కూలింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు అని ఓ వినియోగదారుడు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను సోషల్ మీడియాలో ట్యాగ్ చేశాడు.
రైలు
ఏసీ కోచ్ పైకప్పు లీకుపై స్పందించిన పశ్చిమ రైల్వే
ఏసీ కోచ్ పైకప్పు లీకైన వీడియో వైరలైన కొన్ని గంటల తర్వాత పశ్చిమ రైల్వే స్పందించింది. సమస్యను పరిష్కరించామని చెప్పింది.
అవంతిక ఎక్స్‌ప్రెస్‌లోని అన్ని కోచ్‌లను క్షుణ్ణంగా పరిశీలించామని వెల్లడించింది.
గత ఏడాది జులైలో పంచవటి ఎక్స్‌ప్రెస్‌లోని ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లో కూర్చున్న ప్రయాణికులు లీకేజీ రూఫ్ సమస్యను ఎదుర్కొన్నారు. అనేక ఫిర్యాదుల తర్వాత, ఏసీ కోచ్‌ను తొలగించి దాని స్థానంలో మరొక కోచ్‌ను ఏర్పాటు చేశారు.
దేశంలోని రైళ్ల దుస్థితిపై దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంలోని అధికార బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
ప్రభుత్వం బాగా నడుస్తున్న రైళ్లను నాశనం చేసిందని అన్నారు. రైలు కోచ్‌లను ప్రయాణికులకు 'హింస కేంద్రాలు'గా మార్చారని ఆర్‌జేడీ మండిపడింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కాంగ్రెస్ పార్టీ షేర్ చేసిన వీడియో
काश खोखले प्रचार की जगह रेलवे के लिए कुछ काम किया होता।
— Congress (@INCIndia) June 25, 2023
झंडी दिखाने वाले रेल मंत्री अभी विदेश में हैं, नाम वाले रेल मंत्री ध्यान दें। pic.twitter.com/FNLvQL1Ihu