తదుపరి వార్తా కథనం
Nagarjuna Sagar: వేగంగా తగ్గుతున్న నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం.. శ్రీశైలం నుంచి కేవలం 3,058 క్యూసెక్కులు
వ్రాసిన వారు
Sirish Praharaju
Jan 16, 2025
11:53 am
ఈ వార్తాకథనం ఏంటి
నాగార్జునసాగర్ జలాశయంలోని నీటిమట్టం తీవ్రంగా తగ్గుతోంది. బుధవారం ఉదయం నుండి సాగర్ జలాశయానికి శ్రీశైలం నుండి కేవలం 3,058 క్యూసెక్కుల వరద నీరు మాత్రమే వస్తోంది.
సాగర్ జలాశయం నుంచి కుడి కాల్వ ద్వారా 9,853 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 6,712 క్యూసెక్కులు, ఎస్‌ఎల్బీసీ ద్వారా 2,400 క్యూసెక్కులు, వరద కాల్వ ద్వారా 280 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నాయి.
జలాశయ గరిష్ఠ నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం అది 563.40 అడుగుల వద్ద ఉన్నది, ఇది 240.3608 టీఎంసీల సమానమవుతుంది.