Hyderabad: రేపు, ఎల్లుండి హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రేపు, ఎల్లుండి తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. పటాన్‌చెరు-హైదర్‌నగర్, అలాగే కలబ్‌గూర్-పటాన్‌చెరు వరకు ఉన్న పీఎస్సీ పంపింగ్ మెయిన్‌లో వివిధ చోట్ల లీకేజీలు ఏర్పడడంతో మరమ్మతు పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రిపేరింగ్ పనులు రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి రాత్రి 10 గంటల వరకు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు స్పష్టం చేశారు.
Details
నీటి సరఫరా నిలిచే ప్రాంతాలివే
ఆర్సీపురం, అశోక్ నగర్, జ్యోతి నగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనాగూడ, మియాపూర్, బీరంగూడ, అమీన్‌పూర్, భాగ్యనగర్ కాలనీ, ఆఫ్‌టేక్ పాయింట్లు, బల్క్ కనెక్షన్లు, ఎర్రగడ్డ, ఎస్‌ఆర్ నగర్, అమీర్‌పేట్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో ఈ రెండు రోజుల పాటు తాగునీటి సరఫరా ఉండదని అధికారులు వెల్లడించారు. మరమ్మతు పనులు పూర్తయిన అనంతరం నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని, ఈలోగా ప్రజలు ముందస్తుగా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సంబంధిత శాఖ సూచించింది.