LOADING...
Tungabhadra: తుంగభద్ర నుంచి 6 గేట్ల నుంచి దిగువకు ప్రవాహం
తుంగభద్ర నుంచి 6 గేట్ల నుంచి దిగువకు ప్రవాహం

Tungabhadra: తుంగభద్ర నుంచి 6 గేట్ల నుంచి దిగువకు ప్రవాహం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 03, 2025
11:29 am

ఈ వార్తాకథనం ఏంటి

తుంగభద్ర నదిలో వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో, బుధవారం సాయంత్రం జలాశయం గేట్లలో 6 ను రెండడుగుల మేర ఎత్తేశారు. ఈ చర్యతో జలాశయం నుంచి 17,635 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రవాహానికి విడుదల చేశారు. ఇక ఎగువ ప్రాంతాల నుంచి సుమారు 33,000 క్యూసెక్కుల వరదనీరు జలాశయానికి వస్తోంది. ప్రస్తుతం జలాశయంలోని నీటి నిల్వలు 77.14 టీఎంసీలకు పెరిగాయి. రాయచూరు, కొప్పళ జిల్లాలకు సాగునీటి అవసరాలను తీర్చేందుకు బుధవారం రోజున ఎడమ ప్రధాన కాలువ ద్వారా 2,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్‌కు అత్యంత కీలకమైన హెచ్‌సిఎల్‌సి, ఎల్ఎల్‌సి కాలువలకు జలాల విడుదలను ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు.