Page Loader
Maneru Dam : మానేరు డ్యామ్‌లో జలకళ.. రెండు గేట్లు ఎత్తి నీటి విడుదల 
మానేరు డ్యామ్‌లో జలకళ.. రెండు గేట్లు ఎత్తి నీటి విడుదల

Maneru Dam : మానేరు డ్యామ్‌లో జలకళ.. రెండు గేట్లు ఎత్తి నీటి విడుదల 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 16, 2024
02:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కరీంనగర్‌లోని లోయర్ మానేర్ డ్యామ్ (ఎల్‌ఎమ్‌డీ) నిండుకుండలా మారింది. ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వస్తోంది. ఎల్‌ఎమ్‌డీ నీటి నిల్వ సామర్థ్యం 24 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 23 టీఎంసీలకు చేరుకుంది. ఈ పరిస్థితిని నియంత్రించేందుకు సోమవారం ఇంజినీరింగ్ అధికారులు డ్యామ్ గేట్లలో రెండు ఎత్తి, సుమారు మూడు వేల క్యూసెక్కుల నీటిని మానేరు వాగులోకి విడుదల చేశారు. మిడ్ మానేరు నుంచి వచ్చే నీటి ప్రవాహాన్ని పరిశీలించి గేట్లను మూసివేయాలని అధికారులు యోచిస్తున్నారు.

Details

గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలి

సాయంత్రం లేదా రాత్రి గేట్లను క్లోజ్ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మానేర్ డ్యామ్‌లో నీటి రాకతో నది పరివాహక గ్రామాల్లో ప్రజల భద్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. గ్రామస్తులను అప్రమత్తం చేస్తూ, నది వద్దకు వెళ్లకుండా మత్స్యకారులు, గొర్రెల కాపరులు, రైతులు వంటి వారి కోసం హెచ్చరికలు జారీ చేశారు.