Andhra: డేటా సెంటర్లతో ఏపీలో మాకు డిమాండ్.. కిర్లోస్కర్ పంప్స్‌ఎండీ అలోక్ ఎస్.కిర్లోస్కర్
ఈ వార్తాకథనం ఏంటి
విశాఖపట్టణంలో గూగుల్‌తో పాటు రిలయన్స్, బ్రూక్‌ఫీల్డ్ వంటి సంస్థలు కూడా డేటా సెంటర్లు ఏర్పాటు చేయడానికి ముందుకొస్తుండటం, అమరావతి రాజధాని నిర్మాణం తిరిగి వేగం పుంజుకోవడం, రాష్ట్ర ప్రభుత్వం భారీగా గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులను ప్రోత్సహించడం వంటి పరిణామాలు—ఆంధ్రప్రదేశ్‌లో తమ ఉత్పత్తులకు విస్తృతమైన మార్కెట్ ఏర్పడుతోందని కిర్లోస్కర్ పంప్స్ మేనేజింగ్ డైరెక్టర్ అలోక్ ఎస్. కిర్లోస్కర్ పేర్కొన్నారు. ''రాష్ట్రంలో ఏ రంగాలకు పెట్టుబడులు పెరుగుతున్నాయో తెలుసుకుంటే, మా పంప్‌లకు ఎంత డిమాండ్ ఉంటుందో స్పష్టమవుతుంది. దానిని బట్టి భవిష్యత్తులో ఏపీలోనే తయారీ యూనిట్‌ని పెట్టాలా? లేక సర్వీస్ సెంటర్లు ఏర్పాటు చేయాలా? అనే విషయంపై నిర్ణయం తీసుకుంటాం'' అని ఆయన చెప్పారు.
వివరాలు
తాగునీటి ప్రాజెక్టులకు పంప్‌ల సరఫరా
ఆంధ్రప్రదేశ్‌తో తమ సంస్థకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ.. పట్టిసీమతో సహా ఉమ్మడి ఏపీలో అనేక సాగు, తాగునీటి ప్రాజెక్టులకు పంప్‌లను సరఫరా చేసినట్లు తెలిపారు. డేటా సెంటర్లకు ప్రత్యేక రకం పంప్‌లు అవసరమవుతాయని, ఆ రంగంలో రాబోయే కాలంలో పెద్ద అవకాశాలు ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పంప్‌ల వినియోగం పెరిగితే అవసరాన్ని బట్టి సర్వీస్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తామని అలోక్ అన్నారు. ప్రస్తుతం తమ తయారీ కేంద్రాలు భారత్‌లో మధ్యప్రదేశ్, గుజరాత్, కోయంబత్తూరుతో పాటు అమెరికా, బ్రిటన్ తదితర దేశాల్లో ఉన్నాయని వెల్లడించారు.