LOADING...
MK Stalin: విజయం, ఓటమి రెండూ చూశాం.. స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
విజయం, ఓటమి రెండూ చూశాం.. స్టాలిన్ కీలక వ్యాఖ్యలు

MK Stalin: విజయం, ఓటమి రెండూ చూశాం.. స్టాలిన్ కీలక వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
May 05, 2026
02:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

డీఎంకేకి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమిపై ఎం.కే స్టాలిన్ స్పందించారు. ఈ రాజకీయ ప్రయాణంలో తమకు విజయం కూడా కొత్తది కాదని, ఓటమి కూడా కొత్తది కాదని పేర్కొన్నారు. ఈ విషయాలను ఆయన సోషల్ మీడియా వేదిక X ద్వారా వెల్లడించారు. "డీఎంకే ఇప్పటివరకు ఆరుసార్లు అధికారంలోకి వచ్చింది. ఈ ప్రయాణంలో మేం చూడని విజయం లేదు, ఎదుర్కోని ఓటమి లేదు. అయితే సిద్ధాంత పరంగా ఓటమి చెందకుండా ఉండటం చాలా ముఖ్యం. గెలుపోటములను సమానంగా స్వీకరించి, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ముందుకు సాగే వారే నిజమైన కార్యకర్తలని ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి పేర్కొన్నారు. డీఎంకే, టీవీకే మధ్య ఓట్ల తేడా కేవలం 3.52 శాతమేనని స్టాలిన్ తెలిపారు.

వివరాలు

ప్రజల కోసమే మా రాజకీయాలు కొనసాగుతాయి

తమిళ ప్రజలు తమపై బలమైన నమ్మకం ఉంచారని, ప్రతి ఓటును ఆ విశ్వాసానికి ప్రతీకగా భావిస్తున్నానని అన్నారు. మేం అధికారంలో ఉంటే సంక్షేమ పథకాలతో ప్రజలకు సేవ చేస్తాం. విపక్షంలో ఉంటే ప్రజల హక్కుల కోసం పోరాడతాం. ఏ పరిస్థితుల్లోనైనా ప్రజల కోసమే మా రాజకీయాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. 73 ఏళ్ల స్టాలిన్ ఇప్పటివరకు ఏడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ఈసారి ఆ విజయ పరంపర కొనసాగలేదు. కొలత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన, టీవీకే అభ్యర్థి విఎస్ బాబు చేతిలో సుమారు 9 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అనంతరం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, తన రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపించారు.

Advertisement