LOADING...
Amit shah: బెంగాల్‌ చుట్టూ కంచె వేస్తాం.. ఎన్నికల ప్రచారంలో అమిత్ షా సంచలన ప్రకటన
బెంగాల్‌ చుట్టూ కంచె వేస్తాం.. ఎన్నికల ప్రచారంలో అమిత్ షా సంచలన ప్రకటన

Amit shah: బెంగాల్‌ చుట్టూ కంచె వేస్తాం.. ఎన్నికల ప్రచారంలో అమిత్ షా సంచలన ప్రకటన

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 13, 2026
04:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్‌లో అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర సరిహద్దు వెంట కంచె ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బర్ధమాన్‌లో నిర్వహించిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్ నుంచి అక్రమ వలసదారులను తొలగించగలిగేది కేవలం బీజేపీ మాత్రమేనని అమిత్ షా పేర్కొన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాలనపై విమర్శలు గుప్పిస్తూ, ఆమె ప్రభుత్వం రోజులు లెక్కపెట్టాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.

వివరాలు

 మైనార్టీ వర్గాలను భయభ్రాంతులకు గురి చేస్తోంది

బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సరిహద్దు భద్రతను బలోపేతం చేసే దిశగా బీఎస్‌ఎఫ్‌కు భూమి కేటాయించి కంచె ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. బెంగాల్‌లో మైనార్టీ వర్గాలను భయభ్రాంతులకు గురిచేసేలా మమతా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రజలు బాంబులకు ఓట్లతో సమాధానం ఇస్తారని పేర్కొన్నారు. రాష్ట్రం, దేశ భద్రత కోసం చొరబాటుదారులను తరిమికొట్టడం ఈ ఎన్నికల్లో ప్రధాన అజెండా కావాలని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగేందుకు ఎన్నికల సంఘం తగిన భద్రతా బలగాలను రాష్ట్రానికి పంపిందని అమిత్ షా తెలిపారు.

Advertisement