BJP: మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం : బీజేపీ
ఈ వార్తాకథనం ఏంటి
మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు స్పష్టం చేశారు. తమ పార్టీకి ఎవరైనా మద్దతు తెలుపుతే స్వాగతిస్తామని చెప్పారు. జనసేన ఒక రాజకీయ పార్టీ అని, ఎన్నికల్లో పోటీ చేస్తే తప్పేముందని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎదుగుదలను కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు అంగీకరించలేకపోతున్నారని రామచందర్‌రావు విమర్శించారు. అందుకే వాస్తవాలకు భిన్నంగా వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు.
Details
పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలొచ్చాయి
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీఆర్‌ఎస్‌కు సరైన అభ్యర్థులే దొరకలేదని వ్యాఖ్యానించారు. పంచాయతీ ఎన్నికల్లో భాజపా మంచి ఫలితాలు సాధించిందని గుర్తు చేశారు. అదే విధంగా మున్సిపల్ ఎన్నికల్లోనూ పార్టీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీలు తమ నివాసాల్లో సమావేశాలు నిర్వహించుకోవడంలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. తనకు వ్యతిరేకంగా సమావేశాలు జరిగాయన్న సమాచారమేమీ తనకు లేదని తెలిపారు. కవిత కొత్త పార్టీ స్థాపిస్తారో లేదో తనకు తెలియదని రామచందర్‌రావు స్పష్టం చేశారు.