NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rythu Bharosa : రైతు భరోసా హామీని కచ్చితంగా నేరవేరుస్తాం: భట్టి విక్రమార్క
    తదుపరి వార్తా కథనం
    Rythu Bharosa : రైతు భరోసా హామీని కచ్చితంగా నేరవేరుస్తాం: భట్టి విక్రమార్క
    రైతు భరోసా హామీని కచ్చితంగా నేరవేరుస్తాం: భట్టి విక్రమార్క

    Rythu Bharosa : రైతు భరోసా హామీని కచ్చితంగా నేరవేరుస్తాం: భట్టి విక్రమార్క

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 29, 2024
    05:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రైతు భరోసా పథకం అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రైతు భరోసా సబ్ కమిటీ చైర్మన్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

    ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఇచ్చిన హామీని నెరవేరుస్తామని స్పష్టం చేశారు.

    సచివాలయంలో భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హజరయ్యారు.

    ఈ సమావేశంలో రానున్న యాసంగి పంటకు రైతు భరోసా అందజేసేందుకు అనుసరించాల్సిన విధి విధానాలపై రెండు గంటలపాటు చర్చించారు.

    రైతు బంధు పథకం అమలు తీరును, కేబినెట్ సబ్ కమిటీ పర్యటనల సమయంలో రైతుల నుంచి వచ్చిన అభిప్రాయాలను, అధికారుల సేకరించిన సమాచారాన్ని సమీక్షించారు.

    Details

    రైతును రక్షించే ప్రభుత్వానిదే 

    ఎన్ని ఎకరాలకు రైతు భరోసా అమలు చేయాలనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.

    ట్యాక్స్ పేయర్స్‌, ప్రభుత్వ ఉద్యోగులను ఈ పథకానికి అనర్హులుగా ప్రకటించాలని కమిటీ సూచించింది. రైతు భరోసాపై మరొకసారి సమావేశం కావాలని నిర్ణయం తీసుకుంది.

    సబ్ కమిటీ భేటీ అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఏడాది పాటు శ్రమించినా ప్రకృతి విపత్తుల కారణంగా పంట చేతికి వస్తుందో రాదో అనే భయాలు రైతులను వేధిస్తున్నాయని అన్నారు.

    ఇలాంటి పరిస్థితుల్లో రైతులను రక్షించే బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు.

    Details

    ఆయిల్ ఫామ్ సాగు కోసం రూ.80.10 కోట్లు

    పంటల బీమా పథకం కింద ప్రీమియంను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన చెల్లిస్తుందని, పంటలకే కాదు, రైతు కుటుంబాలకు భరోసాగా నిలిచేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

    అలాగే, 2024-25లో రాష్ట్రంలో ఒక లక్ష ఎకరాల ఆయిల్ ఫామ్ సాగును చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

    2023-24 సంవత్సరానికి గాను ఆయిల్ ఫామ్ సాగు పథకం కింద కేంద్ర ప్రభుత్వం 80.10 కోట్లు విడుదల చేయగా, రాష్ట్ర వాటాతో కలిపి మొత్తం 133.5 కోట్లు విడుదల చేసినట్లు ప్రకటించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    కాంగ్రెస్

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    తెలంగాణ

    Cyber crimes: ప్రతిసెకనుకు 11 దాడులు.. డిజిటల్ ప్రపంచంలో పెరుగుతున్న ముప్పు! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    Ande Sri: తెలంగాణ తల్లి విగ్రహంపై అందె శ్రీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు భారతదేశం
    Jithender Reddy: తెలంగాణ ఒలింపిక్‌ సంఘం నూతన అధ్యక్షుడిగా జితేందర్‌రెడ్డి ఎంపిక స్పోర్ట్స్
    CM Reventh Reddy: లగచర్ల రైతు ఘటనపై సీఎం రేవంత్ ఆగ్రహం.. విచారణకు ఆదేశాలు రేవంత్ రెడ్డి

    కాంగ్రెస్

    Mallikarjuna Kharge: ఎన్నికల ప్రచారంలో మల్లికార్జున ఖర్గేకు తీవ్ర అస్వస్థత.. వీడియో వైరల్  మల్లికార్జున ఖర్గే
    Congress: వేదికపైనే కాంగ్రెస్ మహిళా నేతపై వేధింపులు.. పార్టీపై తీవ్ర విమర్శలు (వీడియో) హర్యానా
    MP Son Arrested: రోడ్డు ప్రమాదం.. కాంగ్రెస్‌ ఎంపీ కుమారుడు అరెస్ట్ రోడ్డు ప్రమాదం
    Rahul Gandi: కులగణనకు మద్దతుగా 50% రిజర్వేషన్ పరిమితిని ఎత్తివేయాలి.. రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025