కేసీఆర్ చనిపోతే రూ.5లక్షలు.. కేటీఆర్ మరణిస్తే రూ.10లక్షలు ఇస్తాం: బీజేపీ ఎంపీ అరవింద్ కామెంట్స్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రచారం వాడీ వేడీగా సాగుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఆయా పార్టీల నాయుకులు దూకుడు పెంచుతున్నారు. ఈ క్రమంలో కొందరు నాయకులు చేస్తున్న కామెంట్స్ తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. తాజాగా నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్.. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, కవితపై మృతి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బీజేపీలో సభలో బీఆర్ఎస్ ప్రకటించిన మేనిఫెస్టోపై ఎంపీ అరవింద్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బీమా పథకం కింద చనిపోయిన రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. అయితే చనిపోయిన రైతు వయస్సు 56 ఏళ్లలోపు ఉండాలనే నిబంధనపై అరవింద్ అభ్యంతరం చెప్పారు.
కవిత చనిపోతే రూ.20లక్షలు: అరవింద్
బీజేపీ సభలోనే కేసీఆర్, కేటీఆర్ మృతిపై అరవింద్ మాట్లాడారు. చంద్రశేఖర్‌రావు చనిపోతే రూ.5లక్షలు, కేటీఆర్ చనిపోతే రూ.10లక్షలు బీజేపీ ఇస్తుందని అరవింద్ ప్రకటించారు. అలాగే కేసీఆర్ కూతురు కవిత చనిపోతే ఆ మొత్తాన్ని రూ.20 లక్షలకు పెంచాతామన్నారు. అరవింద్ వ్యాఖ్యలపై కేసీఆర్ కుమార్తె కవిత ఘాటుగా స్పందించారు. 'అరవింద్ ధర్మపురి మీ కూతుళ్లపై ఇలాంటి ప్రకటనలు చేస్తే ఊరుకుంటారా?' అని ప్రశ్నించారు. ఈ వ్యక్తిగత దాడులు ఎంత వరకు నిజమో ప్రజలే నిర్ణయించాలని కవిత అన్నారు. ఎంపీ అరవింద్ ధర్మపురి 'అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్' వ్యాఖ్యలపై ఆలోచించాలని రాష్ట్ర ప్రజలను కె కవిత కోరారు.