Loading...
Visakhapatnam: అగౌరవ పరిస్తే ఊరుకోం.. వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెబుతాం: ఉపాధ్యాయుల హెచ్చరిక
అగౌరవ పరిస్తే ఊరుకోం.. వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెబుతాం: ఉపాధ్యాయుల హెచ్చరిక

Visakhapatnam: అగౌరవ పరిస్తే ఊరుకోం.. వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెబుతాం: ఉపాధ్యాయుల హెచ్చరిక

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 30, 2026
02:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

మధ్యతరగతి కుటుంబాల్లో జన్మించి, గౌరవప్రదంగా ఉపాధ్యాయ ఉద్యోగాన్ని సాధించిన తమపై వైసీపీ నేతలు అసత్య ఆరోపణలు చేయడంపై మెగా డీఎస్సీ టీచర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌరవంగా ఉద్యోగాలు చేస్తున్న తమను అగౌరవపరిస్తే.. వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని వారు హెచ్చరించారు. మెగా డీఎస్సీ 2026పై జరుగుతున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టేందుకు ఉపాధ్యాయులు నడుం బిగించారు. ఇందులో భాగంగా విశాఖపట్నం వేదికగా మెగా డీఎస్సీ ఆత్మగౌరవ గర్జన కార్యక్రమాన్ని నిర్వహించారు.

వివరాలు

'చలో విశాఖ' నినాదంతో తరలివచ్చిన ఉపాధ్యాయులు

ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి వేలాదిగా ఉపాధ్యాయులు 'చలో విశాఖ' నినాదంతో తరలివచ్చారు.

'విక్టరీ ఎట్ సీ' ప్రాంగణం నుంచి ప్రారంభమైన ర్యాలీ ఆర్కే బీచ్‌ వరకు కొనసాగింది.

ఈ సందర్భంగా మెగా డీఎస్సీ 2026పై జరుగుతున్న అసత్య ప్రచారాలను ఖండిస్తూ, తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు ఉపాధ్యాయులు తమ నిరసనను వ్యక్తం చేశారు.

ADVERTISEMENT