తదుపరి వార్తా కథనం
Alluri: బంగాళాఖాత వాయుగుండం ప్రభావం.. అల్లూరి జిల్లాలో మారిన వాతావరణం
వ్రాసిన వారు
Sirish Praharaju
Jan 12, 2026
11:55 am
ఈ వార్తాకథనం ఏంటి
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం అల్లూరి సీతారామరాజు జిల్లాలో వాతావరణ మార్పుకు దారితీసింది. దీంతో మన్యంలోని పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి నుంచే తేలికపాటి జల్లులు పడాయి. గత కొద్ది రోజులుగా తీవ్రంగా కనిపించిన పొగమంచు ప్రభావం ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. అయితే చలి తీవ్రత మాత్రం ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం జి.మాడుగుల ప్రాంతంలో 12.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ అప్పలస్వామి వెల్లడించారు. అదే విధంగా పెదబయలు 12.9 డిగ్రీలు,ముంచంగిపుట్టు 13 డిగ్రీలు,అరకులోయ 13.5 డిగ్రీలు, హుకుంపేట 14 డిగ్రీలు, చింతపల్లి 14.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఆయన తెలిపారు.