Page Loader
Weather-Rains: తెలంగాణకు చల్లటి కబురు‌‌-సోమవారం నుంచి ఐదురోజుల పాటు వర్షాలు

Weather-Rains: తెలంగాణకు చల్లటి కబురు‌‌-సోమవారం నుంచి ఐదురోజుల పాటు వర్షాలు

వ్రాసిన వారు Stalin
May 05, 2024
06:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎండలతో ఉక్కిరిబిక్కిరిపోతున్న ప్రజానీకానికి చల్లటి కబురు చెప్పింది హైదరాబాద్​ వాతావరణ శాఖ. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి ఐదు రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడతాయని తాజా ప్రకటనలో వెల్లడించింది. దాదాపు అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్​ కూడా జారీ చేసింది. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో వరుసగా ఐదో రోజు కూడా ఎండ దంచి కొడుతున్నాయి.

Weather-Rains:

నిప్పుల గుండంలో తెలంగాణ...

రానున్న రెండు రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్​ వాతావరణ శాఖ హెచ్చరించిది. శనివారం అత్యధికంగా జగిత్యాల జిల్లా లో జైన,కరీంనగర్ జిల్లా వీణవంకలో 46.8 డిగ్రీలు,నల్లగొండ జిల్లా తెల్దేవరపల్లిలో 46.8° ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏడు జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా 18 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి .