LOADING...
Weather Update: తెలంగాణలో భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు
తెలంగాణలో భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు

Weather Update: తెలంగాణలో భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు

వ్రాసిన వారు Sirish Praharaju
May 13, 2025
04:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ వర్షాలకు కారణంగా ఉత్తర-దక్షిణ ద్రోణి ప్రభావం,ఉపరితల చక్రవాత ఆవర్తనాలు ఉన్నాయని తెలిపింది. వీటితో పాటు క్యుములోనింబస్‌ మేఘాలు కూడా ప్రభావితం చేస్తున్నాయని పేర్కొంది. ఇవి పగటి వేళ ఉష్ణతాపం పెరగడానికీ, అలాగే సాయంత్రం సమయంలో ఉరుములు, మెరుపులు, గాలివానలతో కూడిన వర్షాలకూ కారణమవుతున్నాయని వివరించింది. వచ్చే నాలుగు రోజుల పాటు ఉత్తర, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు పేర్కొన్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని పశ్చిమ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిపారు.

వివరాలు 

నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు

ఇదిలా ఉండగా, నైరుతి రుతుపవనాలు మరింత వేగంగా కదులుతున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మంగళవారం మధ్యాహ్నానికి ఈ రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, అలాగే దక్షిణ బంగాళాఖాతానికి చేరాయని పేర్కొంది. రుతుపవనాల ప్రభావంతో గత రెండు రోజులుగా నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయని తెలిపింది.

Advertisement