Page Loader
దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో శ్రీలంక అధ్యక్షుడుని కలిసిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి  
దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో శ్రీలంక అధ్యక్షుడుని కలిసిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి

దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో శ్రీలంక అధ్యక్షుడుని కలిసిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి  

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 13, 2023
04:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే బుధవారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని విపక్ష కూటమి ఇండియాకి నాయకత్వం వహించబోతున్నారా అని ప్రశ్నించగా..అందుకు ఆమె సమాధానమిస్తూ.. రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు మ‌ద్ద‌తిస్తే తాము అధికార ప‌గ్గాలు చేప‌డ‌తామ‌ని బదులిచ్చారు. శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దుబాయ్ విమానాశ్రయంలో కలుసుకున్నారు. మమతా దుబాయ్,స్పెయిన్‌లో 12 రోజుల పర్యటనలో ఉన్నారు. ఈ సంవత్సరం నవంబర్ లో జరగనున్న బెంగాల్ గ్లోబల్ సమ్మిట్ 2023 సదస్సుకు ఆయనను ఆహ్వానించారు.

Details 

మమతా బెనర్జీ ని  శ్రీలంక ప‌ర్య‌ట‌న‌కు ఆహ్వానించిన విక్ర‌మ్ సింఘే

దుబాయ్ ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో శ్రీలంక అధ్యక్షుడు విక్ర‌మ్ సింఘే కలిసి కొద్దిసేపు సంప్ర‌దింపులు జరిపినంతరం, బెంగాల్ బిజినెస్ స‌మ్మిట్‌కు ఆయ‌న‌ను ఆహ్వానించాన‌ని మ‌మ‌తా బెన‌ర్జీ ట్విట్ట‌ర్ వేదిక‌గా రాసుకొచ్చారు. అలాగే విక్ర‌మ్ సింఘే త‌న‌ను శ్రీలంక ప‌ర్య‌ట‌న‌కు ఆహ్వానించార‌ని తెలిపారు. కాగా, ఢిల్లీలోని శ‌ర‌ద్ ప‌వార్ నివాసంలో సీట్ల స‌ర్ధుబాటుపై చ‌ర్చించేందుకు బుధ‌వారం సాయంత్రం విప‌క్ష ఇండియా కూట‌మి భేటీ కానుంది. ఈ భేటీలో బీజేపీని ఎదుర్కొనేందుకు ప్ర‌చార ఏర్పాట్లు, ర్యాలీల నిర్వ‌హ‌ణ‌పైనా విప‌క్ష నేత‌లు చ‌ర్చించ‌నున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

శ్రీలంక అధ్యక్షుడుని కలిసిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి