West Bengal: పశ్చిమ బెంగాల్ ఎన్నికలు.. టీఎంసీ అభ్యర్థుల జాబితా విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
వచ్చే నెలలో పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ (TMC) తరఫున అభ్యర్థుల పూర్తి జాబితాను ప్రకటించారు. మొత్తం 294 స్థానాల్లో 291 స్థానాలకు టీఎంసీ పోటీకి దిగుతున్నట్లు వెల్లడించారు. డార్జిలింగ్ ప్రాంతానికి చెందిన మూడు స్థానాల్లో అనిత్ థాపా నాయకత్వంలోని బీజీపీఎం పార్టీ అభ్యర్థులు పోటీ చేయనున్నారని స్పష్టం చేశారు. అదేవిధంగా, భవానీపుర్ నియోజకవర్గం నుంచి తానే పోటీ చేస్తున్నట్లు మమతా బెనర్జీ తెలిపారు. ఈ నియోజకవర్గంలో భాజపా తరఫున ప్రస్తుత అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి పోటీలో ఉన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
భవానీపుర్ నుంచి మమత బరిలో..
For the West Bengal Assembly elections, TMC has announced its list of 294 candidates, with CM Mamata Banerjee contesting from Bhawanipur and newly joined Pabitra Kar taking on Suvendu Adhikari in Nandigram pic.twitter.com/TvpEuGY2gE
— IANS (@ians_india) March 17, 2026