Page Loader
West Bengal Panchayat Election: భారీ భద్రత నడుమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ 
భారీ భద్రత నడుమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్

West Bengal Panchayat Election: భారీ భద్రత నడుమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ 

వ్రాసిన వారు Stalin
Jul 11, 2023
12:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల పోలింగ్ హింసాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో భారీ భద్రత నడుమ మంగళవారం పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఉదయం 8:00 గంటల నుంచి రాష్ట్రంలోని 22 జిల్లాల్లోని 339 కేంద్రాల్లో ఓట్లను లెక్కిస్తున్నారు. భద్రతా దళాలు, సీసీటీవీ నిఘాలో కౌంటింగ్ చేపడుతున్నారు. దాదాపు వార్డ్ మెంబర్ నుంచి సర్పంచ్ వరకు దాదాపు మొత్తం మూడంచెల వ్యవస్థలోని 74,000స్థానాల్లో ఎవరు గెలుస్తారో నేడు తేలనుంది. జూన్ 8న ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో చేలరిగిన రాజకీయ హింసాకాండలో 42మంది మరణించారు. 2018లో జరిగిన పంచాయతీ ఎన్నికల పోలింగ్ రోజున 12 మంది మృతి చెందారు. హింస నేపథ్యంలో 19జిల్లాల్లోని 696 బూత్‌లలో సోమవారం రీపోలింగ్ నిర్వహించారు.

పశ్చిమ బెంగాల్

పంచాయతీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీఎంసీ, బీజేపీ

రాష్ట్రంలో 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఎలక్షన్లు కావడంతో అటు బీజేపీ, ఇటు టీఎంసీ ప్రతిష్ఠాత్మంగా తీసుకున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ఈ పంచాయతీ ఎన్నికలు సెమీఫైనల్‌గా రెండు పార్టీలు భావించాయి. 2021లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించి టీఎంసీ అధికారంలోకి వచ్చింది. అందుకు ప్రతీకారంగా ఈ ఎన్నికల్లో గెలవాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నించింది. మొదటి రౌండ్ నుంచి టీఎంసీ ఆధిక్యంలో దూసుకుపోతోంది. మెజారిటీ స్థానాల్లో టీఎంసీ ఆధిక్యంలో ఉన్నట్లు ఫలితాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే, డైమండ్ హార్బర్‌లోని కౌంటింగ్ బూత్‌లో ఉదయం 9:00 గంటలకు పేలుడు సంభవించింది. 2018 ఎన్నికల్లో టీఎంసీ ఏకగ్రీవంగా 34శాతం సీట్లు గెలుచుకుంది. అయితే ఈసారి బీజేపీ నుంచి పోటీ బలంగా ఎదురైంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

లెక్కింపు కేంద్రాన్ని సందర్శిస్తున్న గవర్నర్ ఆనంద్ బోస్