Loading...
SCO Summit: 'పహల్గామ్ దాడి తర్వాత ఏం మారింది?' పాక్ ఎస్సీఓ ఆహ్వానంపై కాంగ్రెస్ ఫైర్!
'పహల్గామ్ దాడి తర్వాత ఏం మారింది?' పాక్ ఎస్సీఓ ఆహ్వానంపై కాంగ్రెస్ ఫైర్!

SCO Summit: 'పహల్గామ్ దాడి తర్వాత ఏం మారింది?' పాక్ ఎస్సీఓ ఆహ్వానంపై కాంగ్రెస్ ఫైర్!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 17, 2026
11:06 am

ఈ వార్తాకథనం ఏంటి

షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సదస్సుకు పాకిస్థాన్‌ను ఆహ్వానిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 20 నుంచి 22 వరకు ఢిల్లీలోని పురానా ఖిలాలో 'ఎస్సీఓ సివిలైజేషనల్ డైలాగ్' పేరుతో ఈ సదస్సు జరగనుంది. ఇందులో పాల్గొనాలని పాకిస్థాన్‌కు కేంద్రం ఆహ్వానం పంపగా.. ఆ దేశం కూడా హాజరయ్యేందుకు అంగీకరించింది. అయితే, పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఏమిటంటూ కాంగ్రెస్ సహా విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

వివరాలు 

కేంద్రం నిర్ణయంపై రాజకీయంగా చర్చ

గత మే నెలలో భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్' సైనిక చర్యల తర్వాత పాకిస్థాన్‌కు మంత్రి స్థాయి ప్రతినిధి బృందాన్ని పంపాలని ఆహ్వానించడం ఇదే తొలిసారి.

దీంతో కేంద్రం నిర్ణయంపై రాజకీయంగా చర్చ మొదలైంది. ఎస్సీఓ నిబంధనల ప్రకారం సభ్యదేశాలన్నింటికీ ఆహ్వానాలు పంపిన క్రమంలోనే పాకిస్థాన్‌కూ ఆహ్వానం అందించినట్లు కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 28న స్పష్టం చేసింది.

ఈ సదస్సుకు తమ దేశం తరఫున వాతావరణ మార్పుల శాఖ మంత్రి ముసాదిక్ మాలిక్ హాజరవుతారని పాకిస్థాన్ విదేశాంగ శాఖ వెల్లడించింది.

ఎస్సీఓ వేదికగా సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు వివిధ నాగరికతల మధ్య పరస్పర చర్చలు, అవగాహన పెంపొందించేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది.

వివరాలు 

కేంద్ర నిర్ణయంపై కాంగ్రెస్ ప్రశ్నలు

పాకిస్థాన్‌కు ఆహ్వానం పంపడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ బైసరన్ ప్రాంతంలో మతం ఆధారంగా పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడి చేసి హతమార్చిన ఘటన తర్వాత పరిస్థితుల్లో వచ్చిన మార్పు ఏమిటని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

అంతటి భారీ ఉగ్రదాడి జరిగిన తర్వాత కూడా పాకిస్థాన్‌ను సదస్సుకు ఆహ్వానించడానికి గల కారణాలను ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.

ఎస్సీఓ అనేది బహుళపక్ష అంతర్జాతీయ వేదిక అయినప్పటికీ.. పహల్గామ్ దాడి తర్వాత పాకిస్థాన్ విషయంలో కేంద్రం వైఖరిలో ఏమైనా మార్పు వచ్చిందా? అన్నది స్పష్టం చేయాలని కోరారు.

ADVERTISEMENT

వివరాలు 

కేంద్ర నిర్ణయంపై కాంగ్రెస్ ప్రశ్నలు

ఈ వ్యవహారంపై కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి, కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ కూడా స్పందించారు.

పాకిస్థాన్ విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానం ఎప్పుడూ స్పష్టంగా ఉండటం లేదని విమర్శించారు.

ప్రభుత్వం అసలు ఏం చేయాలనుకుంటోందో ముందుగా వెల్లడించాలని, అప్పుడే ప్రతిపక్షాలు తమ అభిప్రాయాలను తెలియజేయడానికి అవకాశం ఉంటుందని వ్యాఖ్యానించారు.

ADVERTISEMENT

వివరాలు 

పాకిస్థాన్ ప్రయోజనాలకే భారత్‌తో సత్సంబంధాలు అవసరం: బీజేపీ

మరోవైపు విపక్షాల విమర్శలను బీజేపీ నేత దిలీప్ ఘోష్ తిప్పికొట్టారు.

భారత్‌తో సంబంధాలను మెరుగుపరుచుకోవడం పాకిస్థాన్‌కే ఎక్కువ ప్రయోజనకరమని పేర్కొన్నారు.

ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ వచ్చిన పాకిస్థాన్‌లో ప్రస్తుతం శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని విమర్శించారు.

అక్కడ ఉగ్రవాదులు పోలీస్ స్టేషన్లలోకి చొరబడి పోలీసులు, సైనికులను హతమారుస్తున్నారని ఆరోపించారు.

ఈ పరిస్థితులతో ప్రజలు సైతం దేశాన్ని విడిచి వెళ్లిపోతున్నారని అన్నారు.

సరిహద్దు ఉగ్రవాదం, ఉగ్రవాద కార్యకలాపాలకు అందుతున్న ఆర్థిక సాయాన్ని అరికట్టే విషయంలో ఎస్సీఓ సభ్యదేశాలన్నీ ద్వంద్వ ప్రమాణాలను పక్కనపెట్టి కలిసికట్టుగా పోరాడాలని భారత్ ఎప్పటి నుంచో చెబుతోందని దిలీప్ ఘోష్ గుర్తుచేశారు.

వివరాలు 

సాంస్కృతిక సంబంధాలకు ప్రాధాన్యం

ఈ సదస్సుకు పాకిస్థాన్ ప్రతినిధులు హాజరవుతారని ఆశిస్తున్నట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు.

భారత్,పాకిస్థాన్‌ల సాంస్కృతిక,నాగరికతల అభివృద్ధి పూర్తిగా భిన్నమైన మార్గాల్లో సాగలేదని ఆయన అభిప్రాయపడ్డారు.

1947లో దేశ విభజన జరగడానికి ముందు ఇరు ప్రాంతాల్లోనూ సాంస్కృతిక,నాగరికతల వికాసం సమాంతరంగా కొనసాగిందని పేర్కొన్నారు.

అందువల్ల ఈ అంశంలో భిన్నాభిప్రాయాలకు పెద్దగా అవకాశం ఉండదని అభిప్రాయపడ్డారు. ఇది

లా ఉండగా.. గత నెలలో పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన ఎస్సీఓ సన్నాహక సమావేశానికి భారత్ తరఫున సమన్వయకర్త అలోక్ డిమ్రి హాజరయ్యారు.

తాజాగా ఢిల్లీలో జరగనున్న సివిలైజేషనల్ డైలాగ్ సదస్సుకు పాకిస్థాన్ అంగీకారం తెలపడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు,కేంద్ర ప్రభుత్వ దౌత్య విధానంపై రాజకీయంగా చర్చ మరింత పెరిగింది.

ADVERTISEMENT