LOADING...
Blue Corner Notice: అగ్ని ప్రమాదం తర్వాత పరారీలో లూథ్రా సోదరులు.. రంగంలోకి  ఇంటర్‌పోల్ !
అగ్ని ప్రమాదం తర్వాత పరారీలో లూథ్రా సోదరులు.. రంగంలోకి  ఇంటర్‌పోల్ !

Blue Corner Notice: అగ్ని ప్రమాదం తర్వాత పరారీలో లూథ్రా సోదరులు.. రంగంలోకి  ఇంటర్‌పోల్ !

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 09, 2025
02:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

గోవాలోని 'బర్చ్ బై రోమియో లేన్' నైట్‌క్లబ్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన తర్వాత, క్లబ్ యజమానులు సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రాలు థాయిలాండ్‌కు పరారయ్యారని గోవా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో లూథ్రా సోదరులపై ఇంటర్‌పోల్ ద్వారా బ్లూ కార్నర్ నోటీసు జారీ చేయించాలని గోవా పోలీసులు సీబీఐని ఆశ్రయించారు. ఇంటర్‌పోల్ కలర్-కోడ్ వ్యవస్థలో భాగమైన బ్లూ నోటీసు ద్వారా, నేర దర్యాప్తుకు సంబంధించి వ్యక్తుల గుర్తింపు, వారి ఉన్నతస్థానం, కదలికలు వంటి వివరాలను సేకరించేందుకు సభ్య దేశాలు పరస్పరం సమాచారాన్ని పంచుకుంటాయి. ఆదివారం తెల్లవారుజామున సుమారు 5.30 గంటలకు ఇండిగో విమానంలో లూథ్రా సోదరులు ఫూకెట్‌కు చేరుకున్నట్టు అధికారులు తెలిపారు.

వివరాలు 

ఎఫ్‌ఐఆర్ నమోదు అయిన వెంటనే ఢిల్లీలోని వారి నివాసాలపై దాడులు 

ప్రమాదం అనంతరం మేజిస్ట్రియల్ విచారణ ప్రారంభమై, సంఘటన స్థలాన్ని పరిశీలించిన కమిటీ అవసరమైన పత్రాలను సేకరిస్తోంది. ఇప్పటికే లూథ్రా సోదరులపై లుకౌట్ నోటీసు జారీ చేసిన పోలీసులు,వారిని పట్టుకునేందుకు ఇంటర్‌పోల్ సహకారం కోరారు. "దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకే వారు ఇంత త్వరగా దేశం విడిచారన్న ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది"అని ఓ సీనియర్ అధికారి పీటీఐకి చెప్పారు. ఎఫ్‌ఐఆర్ నమోదు అయిన వెంటనే ఢిల్లీలోని వారి నివాసాలపై దాడులు చేయగా వారు అందుబాటులో లేరని, దాంతో చట్టప్రకారం నోటీసును ఇంటి గేటుకు అంటించామని వెల్లడించారు. ఇదే సమయంలో డిసెంబర్ 7 నాటికే బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ వారి మీద లుకౌట్ సర్క్యులర్ జారీ చేయగా,అప్పటికే వారు ఢిల్లీ నుంచి ఫూకెట్‌కు బయలుదేరినట్టు అధికారులు తెలిపారు.

Advertisement