కెనడా పౌరులకు భారత వీసాల జారీపై హైకమిషనర్ ఏం చెప్పారంటే?
ఈ వార్తాకథనం ఏంటి
కెనడా పౌరులకు భారత వీసాల జారీపై ఆ దేశంలోని హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇరు దేశాల మధ్య నెలకొన్న దౌత్యపరమైన వివాదాల నేపథ్యంలో కెనడియన్లకు ప్రస్తుతం భారత వీసా సేవలను పునఃప్రారంభించే అవకాశం లేదన్నారు.
ప్రస్తుత వాతావరణం సాధారణ దౌత్య, కాన్సులర్ కార్యకలాపాలకు అనుకూలంగా లేదన్నారు.
వీసాల జారీపై కెనడాలోని భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ హిందుస్థాన్ టైమ్స్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు.
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన వివాదం నెలకొంది.
ఈ క్రమంలో నెలరోజులుగా ఇరు దేశాల మధ్య వీసాల జారీ కూడా నిలిచిపోయింది.
కెనడా
అప్పటి వరకు వీసాలను పునఃప్రారంభించలేము: వర్మ
కెనడాలోని భారతీయ దౌత్యవేత్తలు, కాన్సులర్ సిబ్బందికి భద్రతా పరిస్థితులలో మెరుగుదల ఉంటే, కెనడా పౌరులకు ప్రస్తుత వీసా పరిమితులు కొంత వరకు సడలించబడవచ్చని వర్మ పేర్కొన్నారు.
కెనడాలోని అతి తక్కువ సంఖ్యలో శత్రు వ్యక్తులు భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం వల్ల భద్రతాపరమైన ప్రమాదాలు ఉత్పన్నమవుతున్నాయని ఆయన నొక్కి చెప్పారు.
ఇదిలా ఉంటే, నిజ్జర్ హత్యలో వర్మ ప్రమేయం ఉందంటూ.. ఖలిస్థానీ సంస్థ సిక్కుల ఫర్ జస్టిస్ (SFJ) ఆరోపించింది.
అలాగే, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, జైశంకర్‌లను కూడా కెనడా శత్రవులంటూ, హోర్డింగులు పెట్టింది.