
IAS coaching deaths: సివిల్ విద్యార్థులు మృతి.. కతురియా చేసిన నేరమేమిటి?
ఈ వార్తాకథనం ఏంటి
జూలై 27న దిల్లీలో రావుస్ కోచింగ్ బేస్ మెంట్‌లోకి నీరు చేరి ముగ్గురు అభ్యర్థులు మృతి చెందిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
అయితే ఈ విద్యార్థుల మరణానికి పరోక్షంగా ఎస్‌యూవీ డ్రైవర్ మను కతురియా కారణమని దిల్లీ పోలీసులు అరెస్టు చేవారు.
సెక్షన్లు 105, 115(2) కింద అతనిపై కేసులు నమోదయ్యాయి. దిల్లీలో కురిసిన భారీ వర్షానికి వరదలు పొటెత్తాయి.
ఈ నేపథ్యంలో ఓల్డ్ రాజేందర్ నగర్‌లోని రావూస్ కోచింగ్ సెంటర్ సెల్లార్ లోకి భారీగా వరద నీరు చేరింది.
Details
కతురియాకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు
ఆ సమయంలో రావూస్ కోచింగ్ సెంటర్ ఎదురుగా ఉన్న రోడ్డుపై మను కతురియా తన ఎస్‌యూవీ వాహనాన్ని వేగాన్ని డ్రైవింగ్ చేశారు.
దీంతో సెల్లార్‌లోకి వరద నీరు చేరుకుంది. సెల్లార్‌లోని లైబ్రరీలో చదువుకుంటున్న ముగ్గురు విద్యార్థులు వరదలో చిక్కుకొని మరణించారు.
ఈ ఘటనలో కతురియా తప్పేమీ లేదని, అతని తరుపు న్యాయవాది వాదించడంతో కతురియాకు షరతులతో కూడిన బెయిల్ లభించింది.
Details
విద్యార్థులు ఉన్నారన్న విషయం కతురియాకు తెలియదు
1997లో ఢిల్లీలోని ఉపహార్ సినిమా అగ్నిప్రమాదంలో 59 మంది మరణించారు,
దీనిపై సెక్షన్ 304 (II) ప్రకారం పునర్విచారణ కోసం వాదనలు ఉన్నప్పటికీ, సినిమా యజమానులపై నిర్లక్ష్య ఆరోపణలను సుప్రీంకోర్టు సమర్థించింది.
విపత్తు కేసుల్లో, సెక్షన్ 304 (II) IPC కింద అభియోగాలను రుజువు చేయడం చాలా కష్టమని కతురియా తరుపు న్యాయవాదులు పేర్కొన్నారు.
దిల్లీ కోచింగ్ క్లాస్ ఘటనలో వరదలు వచ్చినప్పుడు బేస్‌మెంట్‌లో విద్యార్థులు ఉన్నారనే విషయం అతనికి తెలియదన్నారు.
దీంతో ఈ ఘటనకు అతను బాధ్యుడు కాదని లాయర్లు వాదించారు.