LOADING...
Bangladesh: బీజేపీ గెలిస్తే పరిస్థితి ఏంటీ..? బెంగాల్ ఫలితాలపై బంగ్లాదేశ్ ఆందోళన!
బీజేపీ గెలిస్తే పరిస్థితి ఏంటీ..? బెంగాల్ ఫలితాలపై బంగ్లాదేశ్ ఆందోళన!

Bangladesh: బీజేపీ గెలిస్తే పరిస్థితి ఏంటీ..? బెంగాల్ ఫలితాలపై బంగ్లాదేశ్ ఆందోళన!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 01, 2026
04:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ఫలితాలపై కేవలం భారత్‌లోనే కాకుండా పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో కూడా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా బీజేపీ గెలిస్తే తమ దేశంపై ఎలాంటి ప్రభావం ఉంటుందన్న అంశంపై అక్కడి రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. బంగ్లాదేశ్ ఎన్‌సీపీ కార్యదర్శి, ఎంపీ అక్తర్ హుస్సేన్ మాట్లాడుతూ—పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే అక్రమ బంగ్లాదేశీయులను తిరిగి బంగ్లాదేశ్‌కు పంపించే చర్యలు ప్రారంభమయ్యే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ సూచించినట్లుగా బెంగాల్‌లో బీజేపీ విజయం సాధిస్తే లక్షలాది మంది అక్రమ వలసదారులు బంగ్లాదేశ్‌లోకి నెట్టివేయబడే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.

వివరాలు

శరణార్థుల సంక్షోభం పెరిగే అవకాశం

దీనివల్ల ఢాకాలో శరణార్థుల సంక్షోభం పెరిగే అవకాశముందని హెచ్చరించారు. భారత్ నుంచి ముస్లిం వలసదారులను తిరిగి పంపరనే హామీ లేదని, భారీ స్థాయిలో వలసల ప్రవాహం బంగ్లాదేశ్‌పై ఒత్తిడి తెస్తుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే స్పందించారు. అక్రమ చొరబాట్ల అంశంలో అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)పై విమర్శలు గుప్పించారు. తృణమూల్‌కు అనుబంధంగా ఉన్న వ్యక్తులు ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారని ఆరోపించారు. అక్తర్ హుస్సేన్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను కూడా ఆయన సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పంచుకున్నారు

Advertisement