Page Loader
Andhra Pradesh: ఈ నెల 30నుంచి ఏపీలో వాట్సప్‌ గవర్నెన్స్‌ సేవలు.. సీఎం చంద్రబాబు నిర్ణయం 
ఈ నెల 30నుంచి ఏపీలో వాట్సప్‌ గవర్నెన్స్‌ సేవలు.. సీఎం చంద్రబాబు నిర్ణయం

Andhra Pradesh: ఈ నెల 30నుంచి ఏపీలో వాట్సప్‌ గవర్నెన్స్‌ సేవలు.. సీఎం చంద్రబాబు నిర్ణయం 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 29, 2025
05:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పౌరసేవలు అందించేందుకు, ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు, వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వాట్సప్‌ గవర్నెన్స్‌ సేవలను ప్రారంభించింది. ఈ సేవలు జనవరి 30 (రేపటి) నుంచి అందుబాటులోకి రానున్నాయి. వాట్సప్‌ గవర్నెన్స్‌పై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. మొదటి దఫాలో 161 సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా ప్రభుత్వం అధికారిక వాట్సప్‌ నంబరును ప్రకటించనుంది. ఆ నంబరుకు వెరిఫైడ్‌ ట్యాగ్‌ (టిక్‌ మార్క్‌) ఉంటుంది. ఈ నంబరుతో సంబంధిత సేవలు వన్‌స్టాప్‌ సెంటర్‌గా పనిచేస్తాయి. తొలిదశలో 161 రకాల సేవలు అందించబడతాయి, భవిష్యత్తులో వీటిని మరింత విస్తరించనున్నారు.

వివరాలు 

ప్రభుత్వ సమాచారం చేరవేత 

ప్రభుత్వం ప్రజలకు ఏదైనా సమాచారాన్ని చేరవేయాలనుకుంటే, ఈ వాట్సప్‌ ఖాతా ద్వారా సందేశం పంపబడుతుంది. ఉదాహరణకు: ''భారీవర్షాలు, వరదల కారణంగా.. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నాం.'' ''వైరస్‌లు వ్యాప్తిలో ఉన్నందున ఈ జాగ్రత్తలు తీసుకోండి.'' ''మీ ప్రాంతంలో పిడుగులు పడే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండండి.'' ''మీ ప్రాంతంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి'' వంటి సమాచారాన్ని ఒక్కసారిగా కోట్లమందికి చేరవేస్తారు.

వివరాలు 

వినతుల స్వీకరణ, పరిష్కారం 

ప్రజలు తమ వినతులు, ఫిర్యాదులు ఇవ్వాలనుకుంటే ఈ నంబరుకు మెసేజ్‌ చేస్తే, వెంటనే వారికి ఒక లింక్‌ పంపబడుతుంది. అందులో సంబంధిత వ్యక్తి పేరు, ఫోన్‌ నంబరు, చిరునామా పూరించటం ద్వారా వినతిని పంపవచ్చు. తరువాత వారికి ఒక రిఫరెన్స్‌ నంబరు లభిస్తుంది. ఈ నంబరును ఉపయోగించి వారు ఇచ్చిన వినతి పరిష్కార స్థాయిని తెలుసుకోవచ్చు. వారు తమ పరిధిలో ఉన్న మురుగు కాలవల లీకేజీలు, రోడ్డు గుంతలు వంటివి ఫొటోలు తీసి పంపవచ్చు. వాతావరణ కాలుష్యం గురించి కూడా ఫిర్యాదులు చేయవచ్చు.

వివరాలు 

ప్రభుత్వ పథకాల సమాచారం 

ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు అర్హతలు, పథకాలకు లబ్ధి పొందే విధానాలు ఈ వాట్సప్‌ నంబరుకు సందేశం పంపించి తెలుసుకోవచ్చు. పర్యాటక ప్రదేశాల సమాచారం రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాల సమాచారాన్ని వాట్సప్‌ ద్వారా పంపిస్తారు. వాటి నుంచి కావలసిన ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని, అక్కడ టికెట్లు, వసతి సహా అన్ని సేవలు బుక్‌ చేసుకోవచ్చు. విద్యుత్తు బిల్లులు,పన్నుల చెల్లింపు విద్యుత్తు బిల్లులు,ఆస్తి పన్నులు ఈ అధికారిక వాట్సప్‌ ద్వారా చెల్లించవచ్చు.ట్రేడ్‌ లైసెన్సులు పొందవచ్చు. దేవాలయాల్లో దర్శనాల స్లాట్‌ బుకింగ్‌, వసతి బుకింగ్‌, విరాళాలు పంపడం వంటి సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. రెవెన్యూ శాఖకు సంబంధించిన ల్యాండ్‌ రికార్డులు మరియు వివిధ సర్టిఫికెట్లను కూడా పొందవచ్చు.