మణిపూర్‌లో కుకి యువకుడిని సజీవ దహనం.. ప్రధాని మోదీపై 'ఇండియా' కూటమి విమర్శలు
మణిపూర్‌లోని ఓ వీడియో దేశాన్ని మళ్లీ షేక్ చేస్తోంది. కుకీ వర్గానికి చెందిన ఓ యువకుడిని సజీవ దహనం చేసిన వీడియో మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తతలకు కారణమైంది. అయితే ఈ వీడియో తాజాది కాదని, మే నెలలో జరిగిన ఘర్షణలకు సంబంధించిన వీడియో ఇప్పుడు బయటకు వచ్చిందని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై ప్రతిపక్ష ఇండియా కూటమి స్పందించి. ఇది బాధాకరమని పేర్కొంది. ఈ ఘటనపై ప్రధాని స్పందించాలని డిమాండ్ చేశారు. ఇతర దేశాల ఘటనపై స్పందించే ప్రధాని మోదీ మణిపూర్‌ను రక్షించడం మర్చిపోయారని విమర్శించారు. ఈ ఘటనపై మంగళవారం నిరసన తెలిపేందుకు ఇండియా కూటమి సిద్ధమవుతోంది. దీంతో అక్టోబరు 8న ర్యాలీలు, సభలు, లౌడ్‌స్పీకర్ల వినియోగంపై మణిపూర్ యంత్రాంగం నిషేధం విధించింది.