LOADING...
మధ్యప్రదేశ్‌: ట్రక్కును ఢీకొట్టిన బస్సు.. 39మంది బీజేపీ నాయకులకు గాయాలు

మధ్యప్రదేశ్‌: ట్రక్కును ఢీకొట్టిన బస్సు.. 39మంది బీజేపీ నాయకులకు గాయాలు

వ్రాసిన వారు Stalin
Sep 25, 2023
10:19 am

ఈ వార్తాకథనం ఏంటి

మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లా జరిగిన ప్రమాదంలో బీజేపీ నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. బీజేపీ కార్యకర్తలతో వెళ్తున్న బస్సు ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టంది. ఈ ఘటనలో 39మంది బీజేపీ నేతలు గాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం హాజరవుతున్న భోపాల్‌లోని 'కార్యకర్త మహాకుంభ్'కు బీజేపీ నేతలు వెళ్తున్న క్రమంలో ఈ సంఘటన జరిగింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారు ఖపర్జమ్లీ, రూప్‌గఢ్, భగవాన్‌పురా, రాయ్ సాగర్‌కు చెందిన వారని పోలీసులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సాగిన బీజేపీ 'జన్ ఆశీర్వాద యాత్రల' అధికారిక ముగింపు సందర్భంగా సోమవారం 'కార్యకర్త మహాకుంభ్' నిర్వహిస్తున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. ఈ ముగింపు కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మోదీ సభకు వెళ్తున్న క్రమంలో ప్రమాదం