ఏపీ, తెలంగాణలో పదో తరగతి ఫలితాల విడుదల ఎప్పుడంటే?
ఈ వార్తాకథనం ఏంటి
పదో తరగతి ఫలితాల కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పరీక్ష రాసిన లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు.
ప్రభుత్వాలు ఎప్పుడు ఫలితాను విడుదల చేస్తాయా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఏపీలో ఇప్పటికే ఇప్పటికే వాల్యుయేషన్ పూర్తైంది. తెలంగాణలో ఇంకా కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 6లక్షల మంది విద్యార్థులు 10వ తగరతి పరీక్షలు రాశారు. ఏప్రీల్ 18న పరీక్షలు ముగిశాయి.
బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ (బీఎస్ఈఏపీ) ఏప్రిల్ 19నుంచి 23వరకు స్పాట్ వాల్యుయేషన్ నిర్వహించింది. బీఎస్ఈఏపీ ఫలితాల విడుదలకు సంబంధించిన ఏర్పాట్లను చేస్తోంది.
రాబోయే రెండు,ముడు రోజుల్లోనే ఏపీలో ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఏపీలో ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ www.bse.ap.gov , www.indiaresults.com, www.manabadi.co.in లో చూడవచ్చు.
తెలంగాణ
తెలంగాణలో కొనసాగుతున్న వాల్యూయేషన్, మే చివర్లో ఫలితాలు?
బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (బీఎస్‌ఈ)), తెలంగాణ 10వ తరగతి పరీక్షలను ఏప్రిల్ 3 నుంచి 13, 2023 వరకు నిర్వహించింది.
ప్రస్తుతం జిల్లా కేంద్రాల్లో జవాబు పత్రాల వాల్యూయేషన్ కొనసాగుతోంది. గత సంవత్సరం, జూన్ 30న ఎస్ఎస్‌సీ బోర్డు ప్రకటించింది. అయితే ఈ ఏడాది కాస్త ముందుగా ఫలితాను ప్రకటించే అవకాశం ఉంది.
మే చివరి వారంలో పదో తరగతి ఫలితాలను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెల్లడించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వాల్యుయేషన్ త్వరగా పూర్తయ్యోలా ప్రభుత్వం కేంద్రాలను కూడా పెంచింది.
దాదాపు 6వాల్యుయేషన్ కేంద్రాలను ఈసారి పెంచారు. ఫలితాలు వచ్చాక bse.telangana.gov.inలో చూడవచ్చు.