LOADING...
Meghalaya Honeymoon Case: ఇన్ని రోజులు సోనమ్ ఎక్కడ?.. హనీమూన్ కేసులో సంచలన ట్విస్ట్!
ఇన్ని రోజులు సోనమ్ ఎక్కడ?.. హనీమూన్ కేసులో సంచలన ట్విస్ట్!

Meghalaya Honeymoon Case: ఇన్ని రోజులు సోనమ్ ఎక్కడ?.. హనీమూన్ కేసులో సంచలన ట్విస్ట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 10, 2025
05:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లిన రాజా రఘువంశీ దారుణ హత్యకు గురైన విషయం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. తాజా వివరాల ప్రకారం, రాజాను భార్య సోనమ్ పక్కాగా ప్లాన్ చేసిహత్య చేయించిందని పోలీసుల అనుమానం బలపడుతోంది.

Details

హత్య అనంతరం సోనమ్ అదృశ్యం 

రాజా హత్య తర్వాత సోనమ్ రెండు వారాల పాటు కనిపించకుండా పోయింది. జూన్ 9న తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి-ఘాజీపూర్ హైవేపై ఉన్న కాశీ దాబా వద్ద ఆమెను గుర్తించారు. అక్కడి దాబా యజమాని ఫోన్ నుంచి తన సోదరుడితో సోనమ్ మాట్లాడిన నేపథ్యంలో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ స్థితిలో ఇండోర్, యూపీ పోలీసులు కలసి పనిచేసి, నంద్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆమెను అరెస్ట్ చేశారు. సోనమ్ విచారణలో "నా భర్తను నేను చంపలేదు,నలుగురు దుండగులు ఆభరణాల కోసమే హత్య చేశారని చెప్పింది. పోలీసులు రాజ్ కుశ్వాహా (సోనమ్ ప్రియుడు), ఆకాశ్ రాజ్‌పుత్, విశాల్ సింగ్ చౌహాన్, ఆనంద్ కుర్మి ని అరెస్ట్ చేశారు.

Details

సోనమ్ మీద పెరుగుతున్న అనుమానాలు 

సోనమ్ తన పాత్ర లేదని చెప్తున్నప్పటికీ, గత 16 రోజులుగా తాను ఎక్కడ ఉన్నదీ, మేఘాలయ వాటర్‌ఫాల్స్ వద్ద నుండి ఎలా తప్పించుకుందో వివరించేందుకు నిరాకరించింది. పోలీసులు మేఘాలయ వాటర్ ఫాల్స్ వద్దే రాజా మృతదేహాన్ని గుర్తించారు. అలాగే కాశీ దాబా (తన పట్టుబడిన ప్రదేశం) 1,200 కిలోమీటర్ల దూరంలో ఉండగా, అక్కడికి ఎలా చేరుకుందో చెప్పడంలో ఆమె మౌనం వహించింది. ఈ తీరుతో పోలీసులు మరింత అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Details

దర్యాప్తులో కొత్త మలుపులు - ప్రణాళికాత్మక హత్యేనా?

ఈ కేసు SDRF, NDRF, నిఘా సంస్థలు, SIT సహాయంతో దర్యాప్తు సాగుతోంది. ఈస్ట్ కాశీ హిల్స్ ఎస్పీ ప్రకారం, సోనమ్ తన ట్రిప్ మొత్తం లైవ్ లొకేషన్‌ను ప్రియుడు రాజ్ కుశ్వాహాతో పంచుకుంది. పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ - హంతకులు గౌహతిలోని కామాఖ్య ఆలయ సందర్శన తర్వాత కొత్త దంపతులను గమనించటం మొదలుపెట్టారని చెబుతున్నారు. ఇండోర్‌కి చెందిన రాజ్ అక్కడే ఉండగా, ఇతర నిందితులు (ఆకాశ్, విశాల్, ఆనంద్) రైల్లో అస్సాంకు ప్రయాణించి, షిల్లాంగ్ వద్ద హత్యకు కావలసిన ఆయుధాలను గౌహతిలో కొనుగోలు చేశారని సమాచారం. సోనమ్ రాజాను మరికొన్ని రోజులు షిల్లాంగ్‌లో ఉండమని ఒత్తిడి చేసిందన్నది పోలీసుల అనుమానం.

Details

రాజా తల్లి ఉమ ఆవేదన

రాజా తల్లి ఉమ మాట్లాడుతూ, "రాజా ఒకసారి నాకు - ఆమె తనతో పెద్దగా మాట్లాడడం లేదని చెప్పాడు. నేను ఆమెను అడిగినప్పుడు, ఆఫీసు పనిలో బిజీగా ఉన్నానని చెప్పింది. ఆమెతో మాట్లాడమని కూడా నా కొడుకును కోరాను. కానీ ఆమెలో ఏదో రహస్యం ఉందనిపించింది. బలవంతంగా పెళ్లి చేసుకున్నా, విడిపోయేదిగా ఉండేది. కానీ ఈ దారుణానికి అవసరమేంటి?" అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. "రాజా ఏ తప్పు చేయలేదు. ఆమెను ప్రేమించాడు. మేము ఆమెను స్వాగతించాము. కానీ అతనిపై ఆభరణాల కోసమే ఒత్తిడి తెచ్చింది. మా కొడుకు హత్యకు గురికావడాన్ని తట్టుకోలేకపోతున్నామని బాధతో తెలిపారు.

Details

 క్రమంగా బయటపడుతున్న కుట్రలు

మే 11న రాజా రఘువంశీ (వయసు 28) సోనమ్ వివాహం జరిగింది. రాజా ట్రాన్స్‌పోర్టర్‌గా పని చేసేవాడు. హనీమూన్‌ ట్రిప్ కోసం వారు నార్త్ ఈస్ట్ వెళ్లారు. కానీ ఈ ప్రయాణం మరణయాత్రగా మారింది. ఇప్పుడు ఈ కేసు దేశవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తూ, ఊహించని మలుపులు తీసుకుంటోంది. ఇరు కుటుంబాలూ ఈ కేసును CBI దర్యాప్తుకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. నిజం ఏది? కుట్ర ఎంత లోతుగా ఉంది? అన్నదానిపై సమగ్ర దర్యాప్తు తరువాతే స్పష్టత రానుంది.