Gun Fire: కారులో వ్యక్తిపై కాల్పులు.. జిమ్ నుండి తిరిగి వస్తుండగా ఘటన
ఈ వార్తాకథనం ఏంటి
నోయిడా సెక్టార్ 104లో శుక్రవారం బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు కారులోని ఓ వ్యక్తిని కాల్చిచంపారు.
సూరజ్ భాన్ అనే వ్యక్తి జిమ్ నుంచి తిరిగి వస్తుండగా పట్టపగలు ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపారు.
ఘటనా స్థలం నుంచి పారిపోయే ముందు నిందితులు ఐదు రౌండ్ల బుల్లెట్లు కాల్చారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సూరజ్ భాన్ తన కారులో కూర్చున్న వెంటనే గుర్తు తెలియన వ్యక్తులు కాల్చారని చెప్పారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందం ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Details
విచారణ ప్రారంభించిన పోలీసు బృందాలు
సూరజ్‌భాన్ మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ కు పంపామని, కాల్పులకు సంబంధించి హత్య కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
"సూరజ్‌భాన్ అనే వ్యక్తి జిమ్ నుండి తిరిగి వస్తున్నాడు. అతను తన కారులో కూర్చున్న వెంటనే కొందరు అతనిని కాల్చి చంపారు, అతను ఆసుపత్రికి చేరుకునేలోపే అతను మరణించాడు" అని నోయిడా డిసిపి హరీష్ చందర్ తెలిపారు.
నాలుగు వేర్వేరు పోలీసు బృందాలు విచారణ చేపట్టాయని, దర్యాప్తులో భాగంగా సిసిటివి ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు.
గ్రేటర్ నోయిడాలో నారాయణ రౌండ్‌అబౌట్ సమీపంలో కొద్దీ రోజుల క్రితం 40 ఏళ్ల వ్యక్తిని గుర్తు తెలియని అనుమానితులు కాల్చి చంపారు.
ఈ కేసులో 10 మంది అనుమానితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.