Loading...
V. Kamakoti: ప్రియాంకగాంధీ 'గోమూత్ర నిపుణుడు' వ్యాఖ్యలతో చర్చ.. అసలు వి. కామకోటి ఎవరు?
ప్రియాంకగాంధీ 'గోమూత్ర నిపుణుడు' వ్యాఖ్యలతో చర్చ.. అసలు వి. కామకోటి ఎవరు?

V. Kamakoti: ప్రియాంకగాంధీ 'గోమూత్ర నిపుణుడు' వ్యాఖ్యలతో చర్చ.. అసలు వి. కామకోటి ఎవరు?

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 29, 2026
12:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సంస్కరణల నిపుణుల కమిటీ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కమిటీలో సభ్యుల ఎంపికపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా విమర్శలు గుప్పించారు. కమిటీలో ఐబీ మాజీ చీఫ్, ఓ ఐటీ సంస్థ అధినేతతో పాటు "గోమూత్ర నిపుణుడు" కూడా ఉన్నారని ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రియాంక చేసిన ఈ వ్యాఖ్యలు పరోక్షంగా ఐఐటీ మద్రాస్ డైరెక్టర్, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ వి. కామకోటిని ఉద్దేశించినవేనని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. 2025లో గోమూత్రంపై ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆమె ఈ విమర్శలు చేసినట్లు భావిస్తున్నారు.

వివరాలు 

ఎన్‌టీఏ సంస్కరణల కోసం ప్రత్యేక కమిటీ

దేశవ్యాప్తంగా ఇటీవల వెలుగులోకి వచ్చిన పేపర్ లీక్ ఘటనలు, పరీక్షల నిర్వహణపై వచ్చిన విమర్శల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎన్‌టీఏలో సమగ్ర సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.

ఈ క్రమంలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకని నేతృత్వంలో ఉన్నతస్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.

ఈ కమిటీలో సభ్యుడిగా వి. కామకోటికి కూడా చోటు కల్పించింది.

వివరాలు 

వి. కామకోటి ఎవరు?

వి. కామకోటి ఐఐటీ మద్రాస్‌లోనే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు.

అనంతరం అదే విద్యాసంస్థలో అధ్యాపకుడిగా సేవలందిస్తూ,2022లో ఐఐటీ మద్రాస్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.

కంప్యూటర్ ఆర్కిటెక్చర్,ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ,వీఎల్‌ఎస్‌ఐ డిజైన్ వంటి కీలక సాంకేతిక రంగాల్లో ఆయనకు విశేష నైపుణ్యం ఉంది.

పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన దేశ తొలి ఇండస్ట్రియల్ గ్రేడ్ మైక్రోప్రాసెసర్ 'శక్తి' రూపకల్పన బృందానికి ఆయన నాయకత్వం వహించారు.

అదనంగా జాతీయ భద్రతా సలహా మండలిలో సభ్యుడిగా, కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టాస్క్‌ఫోర్స్‌కు చైర్మన్‌గా పనిచేశారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ టెక్నాలజీ కమిటీలలో కూడా సభ్యుడిగా సేవలందించారు.

ADVERTISEMENT

వివరాలు 

గోమూత్ర వ్యాఖ్యలతో వివాదం

ఆయన సేవలకు గుర్తింపుగా 2026లో పద్మశ్రీ పురస్కారం లభించింది.

2025 జనవరిలో చెన్నైలోని ఓ గోశాలలో నిర్వహించిన మాటు పొంగల్ కార్యక్రమంలో పాల్గొన్న కామకోటి, ఆవు మూత్రంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయని, జీర్ణక్రియకు కూడా ఉపయోగకరమని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలు అప్పట్లో శాస్త్రవేత్తలు, ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర విమర్శలకు దారితీశాయి.

అనంతరం స్పందించిన కామకోటి, తాను ప్రచురితమైన పరిశోధనల ఆధారంగానే ఆ అభిప్రాయాన్ని వెల్లడించానని చెప్పారు.

దేశీయ ఆవులపై తనకు ఉన్న ఆసక్తి కారణంగానే ఆ అంశాన్ని ప్రస్తావించినట్లు వివరణ ఇచ్చారు.

ADVERTISEMENT

వివరాలు 

ఎన్‌టీఏ కమిటీలో ఆయన బాధ్యతలు

ఎన్‌టీఏ సంస్కరణల కమిటీలో కామకోటి ప్రధానంగా పరీక్షల నిర్వహణలో సాంకేతిక వ్యవస్థలను మరింత బలోపేతం చేయడం, పారదర్శకత పెంపు, డిజిటల్ భద్రతను మెరుగుపరచడం వంటి అంశాలపై సూచనలు ఇవ్వనున్నారు.

లక్షలాది మంది విద్యార్థులు హాజరయ్యే జాతీయ స్థాయి పరీక్షల్లో స్కోరింగ్ ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చడం, జవాబుదారీతనాన్ని పెంచడం, సాంకేతిక లోపాలను గుర్తించి సరిదిద్దడం వంటి అంశాల్లో ఆయన అనుభవాన్ని కమిటీ వినియోగించుకోనుంది.

ADVERTISEMENT