Loading...
Nepal's Gorkha: అగ్నిపథ్‌లో చేరేందుకు నేపాల్ గూర్ఖా సైనికులు ఎందుకు పట్టుబడుతున్నారు?
అగ్నిపథ్‌లో చేరేందుకు నేపాల్ గూర్ఖా సైనికులు ఎందుకు పట్టుబడుతున్నారు?

Nepal's Gorkha: అగ్నిపథ్‌లో చేరేందుకు నేపాల్ గూర్ఖా సైనికులు ఎందుకు పట్టుబడుతున్నారు?

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 14, 2026
05:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత ఆర్మీ చీఫ్ నేపాల్ పర్యటనకు కొద్ది రోజుల ముందు గూర్ఖా మాజీ సైనికులు, వారి మద్దతుదారులు పోఖరాలో ఆందోళన చేపట్టారు. అగ్నిపథ్ పథకం కింద నేపాలీ యువతను భారత సైన్యంలోకి మళ్లీ నియమించాలని వారు డిమాండ్ చేశారు. పోఖరాలో బుధవారం (ఆగస్టు 12) ఈ ఆందోళన జరిగింది. భారత సైన్యంలో అగ్నిపథ్ పథకం కింద నేపాలీ యువత నియామకాలను తిరిగి ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. ఇండియన్ ఎక్స్-సర్వీస్‌మెన్ గూర్ఖా బ్రిగేడ్ నేపాల్ పోఖరా ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు. అనంతరం ఆందోళనకారులు ఫెడరల్ ప్రభుత్వానికి రెండు అంశాలతో కూడిన వినతిపత్రాన్ని అందించారు.

వివరాలు 

గూర్ఖా మాజీ సైనికులు ఎందుకు ఆందోళన చేస్తున్నారు?

భారత సైన్యంలో నేపాలీ యువత నియామకాలను వెంటనే పునఃప్రారంభించాలని, తమ పేర్లలో 'సోల్జర్' అనే పదాన్ని ఉపయోగిస్తున్న మాజీ సైనికుల సంఘాలకు మళ్లీ గుర్తింపు ఇవ్వాలని కోరారు.

బుధవారం పోఖరా స్టేడియం నుంచి కాస్కీ జిల్లా పరిపాలనా కార్యాలయం వరకు గూర్ఖా మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులు, మద్దతుదారులు ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా 'అగ్నిపథ్ కింద నేపాలీ యువతను భారత సైన్యంలో నియమించండి', 'హోం మంత్రిత్వ శాఖ లేఖను వెనక్కి తీసుకోండి', 'మాజీ సైనికుల గళాన్ని వినండి' అంటూ ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు.

వివరాలు 

గూర్ఖా మాజీ సైనికులు ఎందుకు ఆందోళన చేస్తున్నారు?

నిరసనలో మాట్లాడిన బ్రిగేడ్ ఛైర్మన్ కల్నల్ కృష్ణ బహదూర్ ఖత్రి.. అగ్నిపథ్ పథకం కారణంగా సుగౌలి ఒప్పందం నాటి నుంచి కొనసాగుతున్న 200 ఏళ్లకు పైబడిన సంప్రదాయం ప్రమాదంలో పడిందని అన్నారు.

సుగౌలి ఒప్పందం తర్వాత భారత సైన్యంలో నేపాలీ యువత నియామకాలు ప్రారంభమై 207 ఏళ్లుగా కొనసాగుతున్నాయని చెప్పారు.

అయితే భారత్ అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత వివిధ కారణాలను చూపుతూ నేపాల్ ప్రభుత్వం యువతను భారత సైన్యంలో చేరకుండా అడ్డుకుంటోందని ఆయన పేర్కొన్నారు.

భారత సైన్యంలో నియామకాలు నిలిచిపోవడంతో వందలాది మంది నేపాలీ యువత ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారని ఖత్రి తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు 

గూర్ఖా మాజీ సైనికులు ఎందుకు ఆందోళన చేస్తున్నారు?

భారత్ తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం కింద పరిమిత కాలం సైన్యంలో పనిచేయడం.. గల్ఫ్ దేశాలకు వెళ్లి ఉద్యోగాలు వెతుక్కోవడం కంటే ఎంతో మెరుగైనదని ఆయన అన్నారు.

50 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో గల్ఫ్ దేశాలకు వెళ్లి కనీస వేతనానికి పనిచేయడం కంటే భారత సైన్యంలో ఉద్యోగం వందల రెట్లు మెరుగైనదని వినతిపత్రంలో పేర్కొన్నారు.

నాలుగేళ్ల కాలంలో వివిధ సౌకర్యాలతో కలిపి యువత సుమారు రూ.45 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు సంపాదించవచ్చని అందులో వివరించారు.

ADVERTISEMENT

వివరాలు 

అసలు అగ్నిపథ్ పథకం ఏమిటి?

నేపాల్ గూర్ఖా సైనికుల తాజా ఆందోళనలకు ప్రధాన కారణం భారత సైన్యం అమలు చేస్తున్న అగ్నిపథ్ పథకమే.

సైనిక నియామకాల్లో మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం 2022లో అగ్నిపథ్ పథకాన్ని ప్రకటించింది.

దీనిని 'టూర్ ఆఫ్ డ్యూటీ' అని కూడా పిలుస్తారు. ఈ పథకం కింద అధికారుల స్థాయి కంటే దిగువన ఉన్న సైనికులు, ఎయిర్‌మెన్, నావికులను నాలుగేళ్ల కాలానికి నియమిస్తారు.

ఇలా నియమితులైన వారిని 'అగ్నివీరులు'గా పిలుస్తారు.నాలుగేళ్ల సేవ పూర్తయిన తర్వాత గరిష్ఠంగా 25 శాతం మందిని వారి ప్రతిభ, సైనిక అవసరాల ఆధారంగా శాశ్వత సర్వీసులోకి తీసుకునే అవకాశం ఉంటుంది.

వివరాలు 

అసలు అగ్నిపథ్ పథకం ఏమిటి?

అలా ఎంపికైన వారు మరో 15 ఏళ్లు సేవ చేసే అవకాశం ఉంటుంది. మిగిలిన వారికి ఒకేసారి కొంత మొత్తం చెల్లించి సర్వీసు నుంచి విడుదల చేస్తారు. వారికి పెన్షన్ ఉండదు.

అగ్నివీర్ విధుల్లో ఉండగా మరణిస్తే వారి కుటుంబానికి రూ.1 కోటి వరకు ఒకేసారి ఆర్థిక సాయం అందుతుంది.

అలాగే సేవ చేయాల్సిన మిగిలిన కాలానికి సంబంధించిన పూర్తి వేతనం కూడా లభిస్తుంది.

సైనిక సేవ కారణంగా వైకల్యం ఏర్పడితే, వైకల్యం శాతాన్ని బట్టి గరిష్ఠంగా రూ.44 లక్షల వరకు పరిహారం అందుతుంది.

అగ్నిపథ్ పథకాన్ని ప్రకటించిన సమయంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ఇది సాయుధ దళాల్లో కీలక మార్పు తీసుకొచ్చే పథకమని చెప్పారు.

వివరాలు 

నేపాల్ అగ్నిపథ్‌ను ఎందుకు వ్యతిరేకించింది?

దీని ద్వారా సైన్యంలో యువతను పెంచడంతో పాటు సాంకేతికంగా ఆధునికీకరణ జరుగుతుందని పేర్కొన్నారు.

యువతను సైన్యంలోకి తీసుకురావడం, జీతాలు, పెన్షన్లపై ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడం అనే రెండు ప్రధాన లక్ష్యాలతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు.

అగ్నిపథ్ పథకం అమల్లోకి రాకముందు భారత్-నేపాల్-బ్రిటన్ మధ్య కుదిరిన త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం భారత సైన్యంలో నేపాలీ సైనికుల నియామకాలు జరిగేవి.

స్వాతంత్య్ర సమయంలో కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం గూర్ఖా సైనికులకు సంబంధించిన పలు నిబంధనలు అమల్లోకి వచ్చాయి.

ఈ ఒప్పందం ప్రకారం 2వ, 6వ, 7వ, 10వ గూర్ఖా రెజిమెంట్లు బ్రిటిష్ సైన్యంలోకి వెళ్లాయి.

1వ, 3వ, 4వ, 5వ, 8వ, 9వ రెజిమెంట్లు భారత సైన్యంలో కొనసాగాయి.

వివరాలు 

నేపాల్ అగ్నిపథ్‌ను ఎందుకు వ్యతిరేకించింది?

స్వాతంత్య్రం తర్వాత భారత్ 11వ గూర్ఖా రైఫిల్స్ పేరుతో మరో గూర్ఖా రెజిమెంట్‌ను ఏర్పాటు చేసింది.

నేపాల్‌లో నివసించే గూర్ఖా సైనికుల సేవా నిబంధనలు,పదవీ విరమణ తర్వాత వారికి లభించే ప్రయోజనాలు, పెన్షన్లకు సంబంధించిన అంశాలు కూడా ఈ ఒప్పందంలో ఉన్నాయి.

ప్రతి సమయంలో సుమారు 32 వేల నుంచి 35 వేల మంది నేపాలీ సైనికులు భారత సైన్యంలో పనిచేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.

నేపాల్‌లో భారత సైన్యం మాజీ సైనికుల సంఖ్య సుమారు 1.32 లక్షలుగా ఉందని 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' పేర్కొంది.

అయితే భారత్ అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత నేపాల్ ప్రభుత్వం భారత సైన్యంలో నేపాలీ యువత నియామకాలను నిలిపివేసింది.

వివరాలు 

నేపాల్ అగ్నిపథ్‌ను ఎందుకు వ్యతిరేకించింది?

భారత్, నేపాల్, బ్రిటన్ మధ్య 1947లో కుదిరిన త్రైపాక్షిక ఒప్పందంలోని నిబంధనలకు అగ్నిపథ్ విరుద్ధంగా ఉందని అప్పట్లో నేపాల్ ప్రభుత్వం వాదించింది.

భారత సైన్యంలో నియామక నిబంధనల్లో మార్పులు చేయాలంటే తమతో చర్చించాల్సి ఉందని నేపాల్ ప్రభుత్వంలోని పలువురు అభిప్రాయపడ్డారు.

నేపాల్ చరిత్రకారుడు ప్రత్యూష్ ఒంటా కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు.

త్రైపాక్షిక ఒప్పందంలో నేపాల్ కూడా భాగస్వామి కాబట్టి, భారత్ నిర్ణయం తీసుకునే ముందు తమ అభిప్రాయాలను అడగాల్సిందని ఆయన అన్నారు.

వివరాలు 

గూర్ఖా నియామకాలు నిలిచిపోవడంతో నేపాల్‌కు వచ్చిన నష్టమేంటి?

అయితే నేపాల్ తీసుకున్న నిర్ణయం చివరకు ఆ దేశానికే ఇబ్బందిగా మారింది.

భారత సైన్యంలో పనిచేసే నేపాలీ గూర్ఖా సైనికులు ప్రతి సంవత్సరం సుమారు రూ.1,000 కోట్లను స్వదేశానికి పంపేవారు.

ఈ మొత్తంతో నేపాల్ ఆర్థిక వ్యవస్థకు భారీగా డబ్బు చేరేదని భారత్‌లో మాజీ రాయబారి రంజిత్ రే తెలిపారు. 'కాఠ్‌మాండు డైలెమా: రీసెట్టింగ్ ఇండియా-నేపాల్ టైస్' పుస్తకంలో భారత్-నేపాల్ సంబంధాల గురించి రంజిత్ రే ప్రస్తావించారు. భారత సైన్యంలో పనిచేసే గూర్ఖా సైనికులు నేపాల్‌కు పంపే సొమ్ము.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా ఉపయోగపడుతుందని తెలిపారు.

వివరాలు 

గూర్ఖా నియామకాలు నిలిచిపోవడంతో నేపాల్‌కు వచ్చిన నష్టమేంటి?

త్రిభువన్ విశ్వవిద్యాలయంలోని సెంట్రల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ స్టడీస్‌కు చెందిన డాక్టర్ రత్న మణి నేపాల్ కూడా తన పరిశోధనలో గూర్ఖా సైనికుల నుంచి వచ్చే నగదు బదిలీల ప్రాధాన్యాన్ని వివరించారు.

విదేశీ సైన్యాల్లో పనిచేస్తున్న గూర్ఖాల నుంచి వచ్చే డబ్బు మారుమూల గ్రామాల్లో సామాజిక మార్పుకు దోహదపడిందని, ఆర్థికంగా ప్రజలకు కొత్త వ్యాపార అవకాశాలను కల్పించడంతో ప్రాంతీయ అభివృద్ధికి కూడా ఉపయోగపడిందని ఆయన పేర్కొన్నారు.

ఈ ప్రభావం కేవలం డబ్బుతోనే పరిమితం కాలేదు. పదవీ విరమణ చేసిన గూర్ఖా రైఫిల్స్ సైనికులు భారత్-నేపాల్ మధ్య మంచి సంబంధాలకు కీలకమైన అనుసంధానంగా కూడా పనిచేస్తున్నారు.

వివరాలు 

గూర్ఖా నియామకాలు నిలిచిపోవడంతో నేపాల్‌కు వచ్చిన నష్టమేంటి?

భారత మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ మాట్లాడుతూ.నేపాలీ గూర్ఖాలను భారత సైన్యంలో నియమించాలా వద్దా అనే నిర్ణయం కాఠ్‌మాండు ప్రభుత్వమే తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.

అగ్నిపథ్ కింద భారత సైన్యంలో పనిచేయడానికి నేపాల్ తన సైనికులను పంపుతుందా లేదా అనేది ఇప్పుడు ఆ దేశం నిర్ణయించుకోవాలని ఆయన అన్నారు.

నేపాల్ పౌరులకు ఒక పథకం,భారతీయులకు మరో పథకం ఉండటం సాధ్యం కాదని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా,భారత సైన్యంలో ఉద్యోగ అవకాశాలు కోల్పోవడంతో పలువురు నేపాలీ యువత రష్యా సైన్యంలో చేరి ఉక్రెయిన్‌పై యుద్ధంలో పాల్గొంటున్నట్లు సమాచారం.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సేనల్లో చేరేందుకు 200మందికి పైగా నేపాలీలు రష్యాకు వెళ్లినట్లు కాఠ్‌మాండు అంచనా వేసింది.

ADVERTISEMENT