
Uttar Pradesh: భార్య మృతి తట్టుకోలేక భర్త ఆత్మహత్య
ఈ వార్తాకథనం ఏంటి
రోడ్డు ప్రమాదంలో(Road Accident)భార్యమృతిని తట్టుకోలేక ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.
ఉత్తర్‌ప్రదేశ్(Uttarpradesh)లోని హర్దోయ్ జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.
హర్దోయ్ కి చెందిన యోగేష్ కుమార్(Yogesh Kumar)కు మణికర్ణిక కుమారి(Manikarnika)తో ఆరు నెలల క్రితం వివాహం జరిగింది.
మణికర్ణిక కుమారి వైద్యారోగ్య శాఖలో నర్సుగా పనిచేస్తుంది. యోగేష్ కుమార్ టీచర్ గా పని చేస్తున్నాడు.
సోమవారం ఉద్యోగ విధులు నిర్వర్తించేందుకు వెళ్లిన మణికర్ణిక కుమారి సర్సా పోలీస్ స్టేషన్ సమీపంలోని లక్నో హర్దోయ్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా గుర్తు తెలియని వాహనం ఆమె స్కూటర్ ను బలంగా ఢీకొంది.
దీంతో మణికర్ణిక కుమారి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యింది. ఆమె మొబైల్ నంబర్ ,ఐడి కార్డు ఆధారంగా ఆమెను మణికర్ణికగా గుర్తించారు.
Husband Suicide-UP
భార్య వియోగం తట్టుకోలేక ఉరిపోసుకున్నాడు
అనంతరం ఆమె భర్త యోగేష్ కుమార్ కు సమాచారం అందించారు.
అక్కడకు చేరుకున్న యోగేష్ కుమార్ భార్య వస్తువులను సేకరించుకుని ఇంటికి వెళ్లి తలుపు వేసుకున్నాడు .
భార్యవియోగాన్ని తట్టుకోలేక యోగేష్ కుమార్ తన గదిలో ఉరిపోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు .