
Husband Murder Case: మాంగళ్య బంధం అడ్డుగా ఉందని.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
ఈ వార్తాకథనం ఏంటి
పాతపట్నంలోని మొండిగొల్లవీధి నివాసి నల్లి రాజు (34) ఎనిమిదేళ్ల క్రితం మౌనిక అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమారులు సంతానం. ఈ మధ్యకాలంలో మౌనికకు, అదే ప్రాంతానికి చెందిన గుండు ఉదయ్‌కుమార్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే ఉదయ్‌కుమార్‌కూ అప్పటికే పెళ్లయి ఉంది. ఈ వ్యవహారం భర్త రాజుకు తెలిసిన తర్వాత, భార్యను పలుమార్లు గట్టిగా మందలించినా, మౌనికలో మార్పు రాకపోగా భర్తను 'అడ్డు'గా భావించి తొలగించే కుట్ర పన్నింది. ఉదయ్‌కుమార్ కూడా తన భార్యకు విడాకులు ఇచ్చి, మౌనికతో కలసి జీవించాలని నిర్ణయించుకున్నాడు. మొదటగా ఉదయ్‌కుమార్ ఆడవేషం వేసుకొని, వాట్సాప్ ద్వారా రాజును రాత్రివేళ నిర్మానుష్య ప్రదేశానికి రప్పించే ప్రయత్నం చేశాడు.
Details
ఆహారంలో నిద్రమాత్రలు కలిపిన భార్య
కానీ రాజు అంగీకరించకపోవడంతో ఆ యోచన విఫలమైంది. తర్వాత ఇంట్లోనే హత్య చేయాలని కొత్త ప్లాన్ వేసారు. రెండు రోజుల పాటు మౌనిక భర్త ఆహారంలో నిద్ర మాత్రలు కలిపి పెట్టింది. ఆగస్టు 5 అర్ధరాత్రి రాజు గాఢ నిద్రలోకి జారుకున్న తర్వాత, మౌనిక ఉదయ్‌కుమార్, మల్లికార్జున్‌ను ఇంటికి పిలిపించింది. రాజు కాళ్లను మౌనిక, మల్లికార్జున్ గట్టిగా పట్టుకోగా, ఉదయ్‌కుమార్ దిండుతో ముఖాన్ని నొక్కి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. హత్య అనంతరం రాజు బైక్‌ను స్థానిక ఎస్సీ కాలనీలో వదిలారు.
Details
సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితుల గుర్తింపు
మృతదేహాన్ని మరో బైక్‌పై తీసుకెళ్లి, బైక్ ఉన్న ప్రదేశంలో పడేశారు. అనంతరం మౌనిక భర్త కనిపించడంలేదంటూ కుటుంబసభ్యులకు ఫోన్ చేసి నాటకం ఆడింది. ఆగస్టు 7 ఉదయం స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మౌనిక ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. దాంతో అసలు నిజం బహిర్గతమైంది. పోలీసులు ఉదయ్‌కుమార్, మల్లికార్జున్‌తో పాటు మౌనికను అదుపులోకి తీసుకుని విచారించగా, ముగ్గురూ నేరాన్ని అంగీకరించారు.