
Sukhvinder Sukhu: వైల్డ్ చికెన్ వివాదం.. తినలేదన్న హిమచల్ ప్రదేశ్ సీఎం
ఈ వార్తాకథనం ఏంటి
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు.
షిమ్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం సుఖు పాల్గొనగా, ఆ కార్యక్రమంలో విందు మెనూలో వైల్డ్ చికెన్ కూడా వడ్డించారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి.షిమ్లాలో జరిగిన ఓ విందులో ముఖ్యమంత్రి, ఇతర నేతలు పాల్గొన్నారు.
విందులో భాగంగా వైల్డ్ చికెన్ కూడా మెనూలో ఉంచారు. అది వడ్డించిన వీడియో సోషల్ మీడియాలో ప్రచారం పొందింది.
అయితే సుఖు తాను ఆ వంటకం తినలేదని చెప్పినా ఆరోగ్యశాఖ మంత్రి, ఇతర అతిథులకు చికెన్ వడ్డించారు.
Details
సీఎం క్షమాపణలు చెప్పాలి
వీడియోను జంతు సంరక్షణ సంస్థ ఒకటి పోస్టు చేయడంతో ఈ విషయం ప్రజల్లో చర్చనీయాంశమైంది.
1972 అటవీ సంరక్షణ చట్టం ప్రకారం, వైల్డ్ చికెన్ రక్షిత జాతుల జాబితాలో ఉండడంతో వాటిని వేటాడడం నిషేదం. దీంతో సీఎం సుఖు, ఇతర నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఈ ఘటనపై బీజేపీ సీఎం సుఖు క్షమాపణలు కోరాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
ఈ వివాదంపై స్పందించిన ముఖ్యమంత్రి సుఖు స్థానికులు తనకు ఆ ఆహారాన్ని అందజేశారని, కానీ తాను దానిని తినలేదని చెప్పారు.
కొన్ని మీడియా ఛానెళ్లు తాను ఆ చికెన్ తిన్నానంటూ ప్రచారం చేస్తున్నాయని చెప్పారు.