Page Loader
Asaduddin Owaisi: పాక్ మరోసారి దాడి చేస్తే నాశనం చేస్తాం : ఓవైసీ
పాక్ మరోసారి దాడి చేస్తే నాశనం చేస్తాం : ఓవైసీ

Asaduddin Owaisi: పాక్ మరోసారి దాడి చేస్తే నాశనం చేస్తాం : ఓవైసీ

వ్రాసిన వారు Jayachandra Akuri
May 25, 2025
10:00 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్ ఉగ్రవాద మద్దతును అంతర్జాతీయంగా బహిర్గతం చేయడంలో భాగంగా, ఒడిశా బీజేపీ ఎంపీ 'బైజయంత్‌ జయపాండా' నేతృత్వంలో ఏడుగురు సభ్యుల భారత బృందం బహ్రెయిన్‌కు చేరుకుంది. ఈ బృందం సౌదీ అరేబియా, కువైట్, తదితర గల్ఫ్ దేశాల పర్యటనలో భాగంగా బహ్రెయిన్‌ను సందర్శిస్తోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ దుర్మార్గాలను అంతర్జాతీయ వేదికలపై వివరిస్తూ, భారత్‌కు మద్దతు కోరడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యం. ఈ సందర్భంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ చాలా సంవత్సరాలుగా భారత్‌ ఎదుర్కొంటున్న ఉగ్ర ముప్పును ప్రపంచానికి తెలియజేయడానికే మమ్మల్ని ప్రభుత్వం పంపిందని తెలిపారు. పాక్ కారణంగా భారత్ అమాయక ప్రజల ప్రాణాలను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Details

పాకిస్తాన్‌ ఉగ్రవాదానికి నిలయంగా మారింది 

పాకిస్తాన్‌ ఉగ్రవాద గ్రూపులను ప్రోత్సహిస్తూ వారికి ఆర్థిక సాయం చేస్తోంది. ఇది కొనసాగినంతకాలం భారత్‌పై ముప్పు తీరదని ఒవైసీ హెచ్చరించారు. ప్రతి భారతీయుడి ప్రాణాన్ని కాపాడటం మా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేశారు. పాక్ మళ్లీ దాడులకు పాల్పడితే ఆ దేశం ఊహించనంత తీవ్రంగా భారత్‌ ప్రతిస్పందిస్తుందని హెచ్చరించారు.

Details

FATF గ్రే లిస్టులో పాక్‌కు మళ్లీ స్థానం

పాకిస్తాన్‌ను మళ్లీ FATF గ్రే లిస్ట్‌లో చేర్చాలని కోరుతూ, ఒవైసీ బహ్రెయిన్ ప్రభుత్వాన్ని కోరారు. ఉగ్రవాద నిధులను అడ్డుకోవడంలో అంతర్జాతీయ సహకారం అత్యవసరమని తెలిపారు. పాక్‌కు ఆర్థికంగా సహాయపడితే, ఆ నిధులు ఉగ్ర కార్యకలాపాలకు మళ్లించే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. అందుకే పాకిస్తాన్‌కు నిధులు మంజూరు చేయొద్దని కోరారు. ఈ పర్యటన ద్వారా భారత్‌ ఉగ్రవాదంపై తన స్థానం ఎంత గట్టిగా ఉందో మరోసారి ప్రపంచానికి చాటిచెప్పే ప్రయత్నం చేసింది.