LOADING...
Army Chief :'ప్రపంచ పటం నుండి తొలగించేస్తాం.. జాగ్రత్త'.. పాక్‌కు ఆర్మీ చీఫ్‌ వార్నింగ్

Army Chief :'ప్రపంచ పటం నుండి తొలగించేస్తాం.. జాగ్రత్త'.. పాక్‌కు ఆర్మీ చీఫ్‌ వార్నింగ్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 03, 2025
05:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉగ్రవాదాన్ని పెంచి, ప్రోత్సహిస్తూ ఉన్న పాకిస్థాన్‌ మీద భారత్‌ మరోసారి ఘాటైన హెచ్చరికలు జారీ చేసింది. సీమాంతర ఉగ్రవాదాన్నిఇకనైనా ఆపకపోతే.. ఆ దేశం భౌగోళిక, చారిత్రక అస్థిత్వమే ప్రమాదంలో పడుతుందని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది వార్నింగ్‌ ఇచ్చారు. రాజస్థాన్‌లోని అనూప్‌గఢ్‌లోని సైనిక స్థావరాన్ని సందర్శించిన ఆయన.. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

వివరాలు 

సిందూర్‌ 2.0 దెబ్బ తినాల్సిందే.

"ఆపరేషన్‌ సిందూర్‌ 1.0 సమయంలో మేము సహనాన్ని ప్రదర్శించాం. కానీ ఈసారి ఆ విధంగా ఉండదు. పాకిస్థాన్‌ మళ్ళీ రెచ్చగొడితే, 'సిందూర్‌ 2.0' రూపంలో గట్టిగా ఎదురుదెబ్బ తగలకుండా ఉండదు. భౌగోళిక చరిత్రలో నిలిచిపోవాలా లేదా అనే ప్రశ్న పాక్‌ ఆలోచించుకోవాలి. ప్రపంచపటంలో కొనసాగాలంటే, సరిహద్దు ఉగ్రవాదాన్ని పూర్తిగా ఆపాల్సి ఉంటుంది. లేకపోతే చరిత్రలో తమను తొలగించివేయాల్సి వస్తుంది .. ఇది స్పష్టమైన హెచ్చరిక" అని ఆయన అన్నారు. అంతేకాక, ఏ విధమైన పరిస్థితులకైనా సిద్ధంగా ఉండాలని సైనికులను ఆయన ఆదేశించారు.

వివరాలు 

పాక్‌ను హెచ్చరిస్తున్న భారత సైన్యం

ప్రస్తుతం భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దు ప్రాంతాల్లో, ముఖ్యంగా పశ్చిమ సీహ్‌ క్రీక్‌ ప్రాంతంలో దాయాది సైన్యం చురుకైన చర్యలు చేపట్టినట్లు నిఘా వర్గాలు తెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత సైన్యం అప్రమత్తమై పాక్‌ను హెచ్చరిస్తోంది. నిన్నే కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ కూడా దీనిని ప్రస్తావిస్తూ, పాక్‌ వక్ర బుద్ధి చూపితే చరిత్ర, భౌగోళిక పరిస్థితులు మారవచ్చని గట్టి హెచ్చరిక ఇవ్వడం గమనార్హం.