Page Loader
PM Modi: "పాకిస్తాన్ గాజులు ధరించకపోతే.. మేము ధరించేలా చేస్తాము".. విపక్షాలపై విరుచుకుపడిన మోదీ 
విపక్షాలపై విరుచుకుపడిన మోదీ

PM Modi: "పాకిస్తాన్ గాజులు ధరించకపోతే.. మేము ధరించేలా చేస్తాము".. విపక్షాలపై విరుచుకుపడిన మోదీ 

వ్రాసిన వారు Stalin
May 13, 2024
04:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్‌ ముజఫర్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ విపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 'పాకిస్తాన్ అణుశక్తికి భయపడే పిరికివాళ్లు''గా అభివర్ణించారు. ఈ సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ, ఇటీవల నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా, కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ పాకిస్తాన్ అన్న వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావించారు. ఇండియా కూటమిలో పాకిస్తాన్‌కి భయపడే నాయకులు ఉన్నారని, వారి అణుశక్తి గురించి వారికి పీడకలలు వస్తున్నాయనిఎద్దేవా చేశారు. పీఓకేను భారత్ స్వాధీనం చేసుకుంటుందని బీజేపీ నాయకులు అన్న వ్యాఖ్యలపై ఇటీవల ఫరూఖ్ అబ్దుల్లా మాట్లాడుతూ.. పాకిస్తాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయని, వారు గాజులు తొడుక్కుని లేరని అన్నారు.

Details 

ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ముస్లిం రిజర్వేషన్లకు మద్దతు

ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలపై మోదీ స్పందిందించారు.'' పాకిస్తాన్ గాజులు ధరించకపోతే, మేము వారిని ధరించేలా చేస్తాం. వారికి ఆహారధాన్యాలు లేవని ,ఇప్పుడు వారి వద్ద తగినంత గాజులు కూడా లేవని తెలుసు'' అని ప్రధాని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్, ఆర్జేడీలు దోపిడీలు, కిడ్నాప్‌లతో జంగిల్ రాజ్‌ని తీసుకువచ్చారన్న ఆయన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ముస్లిం రిజర్వేషన్లకు మద్దతు ఇస్తున్నారని, మోడీ బతికున్నంత కాలం ఇది జరగదని ప్రధాని స్పష్టం చేశారు.

Details 

రూ.20 వేల కోట్ల విద్యుత్ బిల్లులను ఆదా చేసిన  ప్రభుత్వం 

ముజఫర్‌పూర్‌లో మోదీ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ హయాంలో ఎల్‌ఈడీ బల్బు రూ.400 ఉండేదని,దాని ధరను తమ ప్రభుత్వం రూ.40-50కి తగ్గించారన్నారు. ప్రతి ఇంటికి చౌకగా ఎల్‌ఈడీ బల్బులు అందజేయడం ద్వారా పేద,మధ్యతరగతి ప్రజలకు రూ.20 వేల కోట్ల విద్యుత్ బిల్లులను ప్రభుత్వం ఆదా చేసిందన్నారు. మీకు రెట్టింపు లాభం చేకూర్చేందుకు మోదీ మరో పథకాన్ని రూపొందించారన్నారు.ఈ పథకంతో మీ కరెంటు బిల్లు జీరో అవుతుందన్నారు. ఈ పథకం పేరు- PM సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకం. దీని కింద పైకప్పుపై సోలార్ ప్యానెళ్లను అమర్చేందుకు ప్రభుత్వం 75 వేల రూపాయలు ఇస్తుంది. మీకు కావాల్సినంత కరెంటు వాడండి, మిగిలిన కరెంటును ప్రభుత్వానికి అమ్మండి అంటే మీకు జీరో కరెంటు బిల్లు, ఆదాయం.