Indian Air Force: మహిళా అధికారిపై వింగ్ కమాండర్ అత్యాచారం
ఈ వార్తాకథనం ఏంటి
జమ్మూ కాశ్మీర్‌లోని వైమానిక దళం స్టేషన్‌లో వింగ్ కమాండర్‌గా ఉన్న ఓ అధికారి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడనని మహిళా ఫ్లయింగ్ ఆఫీసర్ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.
ఇక వింగ్ కమాండర్‌పై మహిళా అధికారి ఫిర్యాదు చేయడంతో జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
డిసెంబర్ 31, 2023 రాత్రి ఆఫీసర్స్ మెస్‌లో జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో అధికారి తన గదిలో లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మహిళా అధికారి ఫిర్యాదు చేసింది.
Details
ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు
ఈ ఘటనపై జమ్ముకశ్మీర్ పోలీసులు వింగ్ కమాండర్‌పై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 376(2) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఈ ఆరోపణలు వెలుగులోకి రాగానే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) కూడా ఈ విషయంలో అంతర్గత విచారణ చేపట్టినట్లు సమాచారం.
ఇలాంటి మరిన్ని లైంగిక వేధింపుల ఆరోపణలు గతంలో కూడా ఆర్మీ, వైమానిక దళాల్లో రావడంతో ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.