
Atishi: దిల్లీ సీఎంగా నేడు అతిషి ప్రమాణస్వీకారం
ఈ వార్తాకథనం ఏంటి
ఆప్ నాయకురాలు అతిషి దిల్లీకి అత్యంత పిన్న వయస్కురాలైన ముఖ్యమంత్రిగా ఇవాళ ప్రమాణం చేయనున్నారు.
ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు రాజ్‌భవన్‌లో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది.
అమెతో పాటు మరో ఐదుగురు కొత్త మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
అతిషితో పాటు గోపాల్ రాయ్, కైలాష్ గహ్లోత్, సౌరభ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్ ప్రమాణం చేయనున్నారు.
సుల్తాన్‌పూర్ మజ్రా ఎమ్మెల్యే ముఖేష్ అహ్లావత్ తొలిసారిగా దిల్లీ మంత్రి మండలిలో చోటు సంపాదించనున్నారు.
కేజ్రీవాల్ రాజీనామాతో ఆప్ శాసనసభా పక్షం అతిషిని ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది.
Details
మూడో మహిళా ముఖ్యమంత్రిగా అతిషి
కేజ్రీవాల్ దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో వచ్చిన వివాదాల కారణంగా ఆయన సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ పూర్వ విద్యార్థి, రోడ్స్ పండితురాలు అయిన అతిషి, సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్ తర్వాత దిల్లీకి మూడో మహిళా ముఖ్యమంత్రిగా నిలవడం గర్వకారణం.
2015లో సలహాదారుగా ఉన్న అతిషి, 2020లో ఎమ్మెల్యేగా ఎన్నికై, 2024లో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు.
ఇప్పుడు అతిషి ముందు కొన్ని సవాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా మహిళా సమ్మాన్ యోజన, ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2.0, ఇంటింటికీ సేవల అందజేత వంటి పెండింగ్‌లో ఉన్న పథకాలను వేగంగా అమలు చేయాల్సిన బాధ్యత ఆమెపై ఉంది.