
Tejashwi Yadav: సంక్షేమ పథకంలో మోసం చేసి రూ.200 తీసుకున్నారంటూ.. తేజస్వీ యాదవ్‌పై కేసు!
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్‌లో మరికొన్ని రోజుల్లో జరిగే ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈక్రమంలో ఓ కొత్త వివాదం తెర పైకి వచ్చింది. ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్‌పై ఒక మహిళ రూ.200 మోసం చేసి తీసుకున్నారంటూ ఫిర్యాదు చేశారు. సింగ్వారా ప్రాంతానికి చెందిన గుడియా దేవి ఫిర్యాదు చేశారు. ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. మై-బెహన్ యోజన పథకం ద్వారా మహిళలకు రూ.2,500 హామీ ఇచ్చే విధంగా దరఖాస్తు చేయించేందుకు ముందుగా తన వద్ద రూ.200 తీసుకున్నారు. అంతేకాకుండా,పలువురు మహిళల నుంచి ఆధార్ కార్డు, మొబైల్ నంబర్లు, బ్యాంకు ఖాతా వివరాలు కూడా తీసుకున్నట్లు తెలిపారు.
వివరాలు
స్పందించని ప్రతిపక్ష నేతలు
ఈ ఘటనకు సంబంధించి తేజస్వీ యాదవ్, రాజ్యసభ ఎంపీ సంజయ్ యాదవ్ సహా పలువురు మీద ఫిర్యాదు నమోదు చేశారు. ఇదే తరహాలో మరో ఫిర్యాదు కూడా నమోదైంది. మిథిలా తోలా ప్రాంతానికి చెందిన చంద్రికా దేవీ వితంతు పింఛన్ పథకంలో మోసం జరిగిందని ఆమె పోలీసులకు వివరాలు అందించారు. కేసు నమోదు వివరాలను పోలీసులు కూడా ధ్రువీకరించారు. ఇక, వీటిపై ప్రతిపక్ష నేతలెవరూ ఇప్పటివరకు స్పందించలేదు.