LOADING...
PM Modi: టీఎంసీ పాలనలో మహిళలకు రక్షణ లేదు : నరేంద్ర మోదీ
టీఎంసీ పాలనలో మహిళలకు రక్షణ లేదు : నరేంద్ర మోదీ

PM Modi: టీఎంసీ పాలనలో మహిళలకు రక్షణ లేదు : నరేంద్ర మోదీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 26, 2026
04:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

బెంగాల్‌లో తృణమాల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నంతవరకు మహిళలకు రక్షణ ఉండదని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, మహిళలను హింసించే గూండాలకు ఆ పార్టీ అండగా నిలుస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు ఇప్పుడు మార్పును కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఈసారి ఎన్నికల్లో భాజపాను గెలిపిస్తే రాష్ట్రాన్ని "జంగిల్ రాజ్" నుంచి విముక్తి చేస్తామని మోదీ హామీ ఇచ్చారు. మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని తమ పార్టీ ఆర్జీకర్ హత్య బాధితురాలి తల్లికు ఎన్నికల టికెట్ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలపై జరిగిన దారుణాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.

వివరాలు

బాాలికల అదృశ్య కేసులు పెరుగుతున్నాయి

బంగావ్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన మోదీ, రాష్ట్రంలో బాలికల అదృశ్య కేసులు పెరుగుతున్నాయని, కానీ ప్రభుత్వం స్పందించడంలో విఫలమవుతోందని ఆరోపించారు. మహిళలతో పాటు రైతులు, కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన వివరించారు. గత 11 ఏళ్లలో జనపనార కనీస మద్దతు ధర (MSP)ను రెట్టింపు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే గోధుమలు, బియ్యం కోసం 100 శాతం జనపనార ప్యాకేజింగ్‌ను తప్పనిసరి చేసినట్లు తెలిపారు. హుగ్లీ నది పరిసరాల్లో ఒకప్పుడు పరిశ్రమలు ఉన్నప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం వాటిని మూసివేసిందని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే పరిశ్రమలను తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. చొరబాటుదారుల సమస్య నుంచి బెంగాల్‌ను విముక్తి చేస్తామని కూడా మోదీ స్పష్టం చేశారు.

Advertisement