LOADING...
Telugu Mahasabhalu: మారిషస్‌లో నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలు
మారిషస్‌లో నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలు

Telugu Mahasabhalu: మారిషస్‌లో నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 05, 2026
11:16 am

ఈ వార్తాకథనం ఏంటి

నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలకు మారిషస్‌ ఆతిథ్యం ఇవ్వనుంది.ఈ మహాసభలను 2027 జనవరి 8,9,10 తేదీల్లో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్ర సారస్వత పరిషత్తు,మారిషస్‌ తెలుగు మహాసభ అసోసియేషన్‌ల మధ్య ఆదివారం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. మూడో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్న వేదికపైనే ఈ ఒప్పంద ప్రక్రియను పూర్తి చేశారు. రెండు దేశాల మధ్య పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయడం,రానున్న మహాసభలను విజయవంతంగా నిర్వహించడమే లక్ష్యంగా ఈ ఎంఓయూ చేసుకున్నట్లు ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు గజల్‌ శ్రీనివాస్‌ వెల్లడించారు. వేదికపై ఇరుదేశాల ప్రతినిధులు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసి, మారిషస్‌ అధ్యక్షుడు ధరమ్‌ బీర్‌ గోకుల్‌ సమక్షంలో ఒప్పందపత్రాలను పరస్పరం మార్పిడి చేసుకున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలకు మారిషస్ ఆతిథ్యం

Advertisement