NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కోటీశ్వరుడైన బిచ్చగాడు.. ఏకంగా రూ.7 కోట్ల ఆస్తిని సంపాదించాడు
    తదుపరి వార్తా కథనం
    కోటీశ్వరుడైన బిచ్చగాడు.. ఏకంగా రూ.7 కోట్ల ఆస్తిని సంపాదించాడు

    కోటీశ్వరుడైన బిచ్చగాడు.. ఏకంగా రూ.7 కోట్ల ఆస్తిని సంపాదించాడు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 07, 2023
    03:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలో బిచ్చగాళ్లకు కొదవఉండదు. ఏ రాష్ట్రాంలోనైనా, ఏ ప్రాంతాలోనైనా పేదరికం ఉంది.దీంతో దేశవ్యాప్తంగా పొట్ట కూటి కోసం అడుక్కుంటారు.

    కానీ ఈ బిచ్చగాడు ప్రత్యేకం. ఎందుకంటే అడుక్కునే కోట్లకు పడగలెత్తాడు. కోటాను కోట్ల డబ్బును కూడబెట్టాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటు చేసుకుంది.

    దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నివాసం ఉండే భరత్ జైన్ యాచక వృత్తిలో భాగంగా 7 కోట్ల రూపాయలను ఆర్జించాడు.

    రూ.1.2 కోట్లతో ఏకంగా డబుల్ బెడ్ రూం ఫ్లాట్‌ ను సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే రెండు షాపులను కిరాయికి ఇచ్చి నెల వారీగా రూ.30 వేల ఆదాయాన్ని పొందుతున్నాడు.

    జైన్ తరచుగా ఛత్రపతి శివాజీ టెర్మినస్, ఆజాద్ మైదాన్ వంటి ప్రముఖ ప్రదేశాల్లో భిక్షాటన చేస్తుంటాడు.

    details

    ప్రతిరోజూ రూ.2500 వరకు సంపాదిస్తున్న జైన్

    బిచ్చమెత్తుకుంటూనే నెలకు రూ.60 వేల నుంచి 75 వేలు సంపాదించి ఔరా అనిపిస్తున్నాడు. ప్రతి రోజు రూ. 2 వేల నుంచి రూ.2,500 వరకు కేవలం యాచక వృత్తిలోనే సంపాదిస్తుండం విశేషం.

    ప్రస్తుతం జైన్ ముంబైలోని పరేల్ ప్రాంతంలో ఓ డూప్లెక్స్ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. చిన్నతనంలో ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువుకోలేకపోయిన జైన్, తన పిల్లలను మాత్రం ఇంగ్లీష్ కాన్వెంట్ లో చదివిస్తున్నాడు.

    జైన్ కు ఇద్దరు కుమారులు ఉండగా, భార్య స్టేషనరీ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జైన్ ను బిచ్చమెత్తుకోవడం ఆపాలని కుటుంబీకులు కోరారు.

    తనను ఈ స్థాయికి తెచ్చిన యాచక వృత్తిని వదలడం తనకు ఇష్టం లేదని చెప్పడం కొసమెరుపు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర
    ముంబై
    భారతదేశం

    తాజా

    GT vs LSG: గుజరాత్ టైటాన్స్‌పై లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ 33 పరుగుల తేడాతో విజయం ఐపీఎల్
    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌

    మహారాష్ట్ర

    కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆఫీస్‌కు బెదిరింపు కాల్స్; రూ.10 కోట్లు డిమాండ్ నితిన్ గడ్కరీ
    దేశంలో ఆగని కరోనా ఉద్ధృతి; 3వేలు దాటిన కొత్త కేసులు; దిల్లీ ప్రభుత్వం అప్రమత్తం కోవిడ్
    'ఏకే 47తో చంపేస్తాం'; సంజయ్ రౌత్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపు ముంబై
    సావర్కర్, అదానీలకు పవార్ మద్దతు; 'హిండెన్‌బర్గ్'పై జేపీసీ అనవసరమని వ్యాఖ్య శరద్ పవార్

    ముంబై

    చిన్నారి వైద్యం కోసం పేరు చెప్పకుండా రూ.11కోట్లు విరాళంగా ఇచ్చిన దాత కేరళ
    E3W ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేసిన మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ మహీంద్రా
    ముంబయి: 100ఏళ్ల నాటి 'గేట్‌వే ఆఫ్ ఇండియా'కు పగుళ్లు- పెచ్చులూడుతున్న స్మారక చిహ్నం మహారాష్ట్ర
    ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు గురించి రైల్వే మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ట్విట్టర్

    భారతదేశం

    కాలుష్య కోరల్లో చిక్కుకున్న భారత్.. టాప్‌-20 గ్లోబల్ పొల్యూటెడ్ సిటీల్లో 14 నగరాలు మనవే  ప్రపంచం
    ఈ ఏడాది 6,500 మంది మిలియనీర్లు భారత్ విడిచి వెళ్లిపోతారట  చైనా
    బ్రిటన్‌: నాటింగ్‌హామ్ కత్తి దాడిలో ముగ్గురు మృతి; అందులో భారతీయ సంతతి యువతి బ్రిటన్
    భారత్‌లో వీలైనన్ని ఎక్కువ వీసాలను ప్రాసెస్ చేయడానికి కృషి చేస్తున్నాం: అమెరికా  వీసాలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025