Grok: గ్రోక్ ఏఐ చాట్‌బాట్ హిందీ యాస వినియోగంపై కేంద్రం ఆరా
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk)కు చెందిన కృత్రిమ మేధస్సు (AI) అంకుర సంస్థ ఎక్స్‌ఏఐ (xAI) తన గ్రోక్ (Grok) ఏఐ చాట్‌బాట్ సేవలను అందిస్తున్న విషయం విదితమే.
ఇటీవల కొందరు వినియోగదారులు అడిగిన ప్రశ్నలకు గ్రోక్ హిందీ యాసలో కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాలో పెద్ద వివాదంగా మారింది.
తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టిసారించింది.
కేంద్ర సమాచార , సాంకేతిక మంత్రిత్వశాఖ ఈ వివాదంపై ఎక్స్‌ఏఐ ప్రతినిధులతో చర్చలు జరుపుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి.
ఈ సమస్య ఎందుకు ఉత్పన్నమవుతోందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపాయి.
వివరాలు
వివాదాస్పదంగా అభ్యంతరకర పదాలు
ఎలాన్ మస్క్‌కి చెందిన ఎక్స్‌ఏఐ (xAI) సంస్థ ఈ గ్రోక్ చాట్‌బాట్‌ను అభివృద్ధి చేసింది.
భూమిపై అత్యంత తెలివైన ఏఐ సాధనంగా మస్క్ దీన్ని అభివర్ణించారు. ఇటీవల వినియోగదారులు అడిగిన ప్రశ్నలకు గ్రోక్ ఇచ్చిన సమాధానాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి.
హిందీ యాసలో కూడా ఈ చాట్‌బాట్ స్పందిస్తుండటం గమనార్హం.
అయితే, అందులో కొన్ని అభ్యంతరకర పదాలు ఉండటంతో వివాదాస్పదంగా మారింది.
ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.