LOADING...
Yadadri Bhuvanagiri Collector :సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్.. ఏకంగా విద్యార్థి ఇంటికి వెళ్లి..    

Yadadri Bhuvanagiri Collector :సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్.. ఏకంగా విద్యార్థి ఇంటికి వెళ్లి..    

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 06, 2025
04:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉదయం 5 గంటలు కావస్తున్నాయి..! "భరత్ చంద్ర" అనే పేరుపిలుపు వినిపిస్తోంది. తలుపు తెరిచి చూస్తే... జిల్లా ఉన్నతాధికారి ప్రత్యక్షమయ్యారు. వారు ఎవరో కాదు... జిల్లా కలెక్టర్ అని తెలుసుకుని, విద్యార్థి, అతని కుటుంబం ఆశ్చర్యంతో నిండిపోయింది. ఈ అనూహ్య సంఘటన యాదాద్రి జిల్లా లో చోటు చేసుకుంది. జిల్లా కలెక్టర్ తలుపు తట్టారు.. వివరాల్లోకి వెళ్ళితే, త్వరలో పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి.విద్యార్థులకు ప్రత్యేక తరగతులు కూడా జరుగుతున్నాయి. ప్రతీ జిల్లా ఉత్తీర్ణత శాతం పెరిగేందుకు,ప్రభుత్వ ఆదేశాలు కూడా జారీ చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో,జిల్లా అధికారులు ఫలితాలు మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా, యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు "విద్యార్థుల ఇంటి తలుపు తట్టే" కార్యక్రమాన్ని ప్రారంభించారు.

వివరాలు 

విద్యార్థికి ధైర్యం ఇవ్వడం...

ఈ రోజు,సంస్ధాన్ నారాయణపురం మండలం కంకణాలగూడెం వెళ్లి,భరత్ చంద్ర చారి అనే విద్యార్థిని కలిశారు. అతని ఇంటికి వెళ్లి,మరింత కృషితో పరీక్షలకు సిద్ధమవ్వాలని సూచించారు. కుటుంబ ఆర్థిక పరిస్థితిని పరిశీలించి,భరత్ కు జేబు ఖర్చుల కోసం రూ. 5,000 అందజేశారు. అలాగే,భరత్ చదవడానికి ఒక కుర్చీ, రైటింగ్ ప్యాడ్ కూడా ఇచ్చారు. "మంచిగా చదువుకో" జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా కలెక్టర్ భరత్‌కు మాట్లాడుతూ,"పదో తరగతి నీ భవిష్యత్తుకు కీలకమైన మైలురాయి.నీ తల్లి నిన్ను చదివించేందుకు కష్టపడుతోంది.మంచి మార్కులు సాధించి ఆమెకు గర్వం తెచ్చి,జీవితంలో ముందుకు పోవాలి.ఇది నీ విజయయాత్రలో తొలి అడుగు.నీ తల్లిదండ్రులు, గురువులు,జిల్లా గర్వపడేలా చదువుకోవాలి. భవిష్యత్తులో స్థిరపడే వరకు నేను నీకు సహాయం చేస్తాను"అని హామీ ఇచ్చారు.

వివరాలు 

భరత్ చంద్రా చారి స్పందన 

భరత్ మాట్లాడుతూ, "నేను పోలీస్ ఆఫీసర్ కావాలని అనుకుంటున్నాను. నా కలను సాకారం చేసేందుకు, మరింత కష్టపడి చదువుతాను. కలెక్టర్ గారు స్వయంగా వచ్చి నన్ను కలవడం నేను ఊహించలేదు. ఇది నాకు చాలా ఉత్తేజాన్ని ఇచ్చింది. ఇకపై, నా లక్ష్యాన్ని చేరుకోవడానికి మరింత శ్రమిస్తాను" అని చెప్పాడు. భరత్ తల్లి విజయలక్ష్మి, జిల్లా కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కలెక్టర్ పై నెటిజన్ల ప్రశంసలు ఉదయం 5 గంటలకే విద్యార్థి ఇంటికి వెళ్లిన జిల్లా కలెక్టర్ హనుమంతరావుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. "కలెక్టర్ అంటే ఇలా ఉండాలి" అంటూ పలు పోస్టులు పెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

భరత్‌కు కలెక్టర్ మేల్కొలుపు పిలుపు